కీసర ఎమ్మర్వో కేసు : ధర్మారెడ్డి కుటుంబం ఏమంటోంది ? కేఎల్ఆర్ ఏమంటున్నారు ?

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 06:12 PM IST
కీసర ఎమ్మర్వో కేసు : ధర్మారెడ్డి కుటుంబం ఏమంటోంది ? కేఎల్ఆర్ ఏమంటున్నారు ?

Keesara MRO case : కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు మలుపులు తిరుగుతోంది. జైలులోనే నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం, బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. ఈ కేసులో పెద్దపెద్ద నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు కేఎల్ఆర్ పేరు ధర్మారెడ్డి ఆత్మహత్యలో అంశంలో ఎందుకు తెరపైకి వచ్చింది ?. కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ భూముల వ్యవహారంలో జరిగిన గొడవ ఏంటి ? 97 ఎకరాలు ఎవరు ఎందుకు కాజేయాలనుకున్నారు ?



ధర్మారెడ్డి కుటుంబం –
* ధర్మారెడ్డి చావుకు KLR కారణం
* మా భూమిని కబ్జా చేశారు
* మా భూములను ఎందుకు లాక్కుంటున్నారు
* KLRకి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ?
* ధర్మారెడ్డి మరణంపై విచారణ జరగాలి



KLR –
* ధర్మారెడ్డి కుటుంబం ఎందుకు ఆరోపణలు చేస్తుందో తెలియదు -కేఎల్ఆర్
* ధర్మారెడ్డి ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు – కేఎల్ఆర్
* నాగరాజు, ధర్మారెడ్డివి ఆత్మహత్యలు కావు.. హత్యలు -కేఎల్ఆర్
* అధికార పార్టీ నేతల హస్తం ఉందని అనుమానం -కేఎల్ఆర్
* ఈ ఆత్మహత్యలపై సీబీఐ విచారణకు కూడా సిద్ధం-కేఎల్ఆర్
* కేఎల్ఆర్ ఇండస్ట్రీ పార్క్‌లో అవకతవకలు జరగలేదు -కేఎల్ఆర్



కోటి రూపాయల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి.. కుషాయిగూడ వాసవి శివనగర్‌లోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మ్యుటేషన్ ఆరోపణతో ఏసీబీ అతన్ని అరెస్టు చేయగా 33 రోజులపాటు జైలు జీవితం గడిపారు.



ఆయన వయస్సు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్టైన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నారు. కోటి రూపాయల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుసగా ఆత్మహత్యకు చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది.