జైలులో ఆత్మహత్యకు ముందు.. కీసర ఎమ్మార్వో నాగరాజు చివరి వీడియోకాల్

  • Published By: naveen ,Published On : October 17, 2020 / 04:22 PM IST
జైలులో ఆత్మహత్యకు ముందు.. కీసర ఎమ్మార్వో నాగరాజు చివరి వీడియోకాల్

keesara mro nagaraju last videocall: జైలులో ఆత్మహత్యకు ముందు.. కీసర ఎమ్మార్వో నాగరాజు తన కుటుంబానికి చేసిన చివరి వీడియోకాల్.. ఇప్పుడు టెన్ టీవీ చేతిలో ఉంది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు.. నాగరాజు.. తన కుటుంబసభ్యులతో వీడియోకాల్ మాట్లాడారు. తనపై నమోదు చేసిన రెండో కేసులో.. ఏసీబీ కస్టడీలోకి తీసుకోవడానికి ముందు.. కేసుకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని.. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయని చెప్పారు.

తాము ప్రాసెస్ చేసినవి.. ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావని.. అన్నీ పరిశీలించాకే.. వెరిఫై చేశామని తెలిపారు నాగరాజు. ఈ విషయాన్ని.. లాయర్‌కి చెప్పి.. కోర్టులో తెలపాలని కుటుంబానికి విన్నవించారు. ఐతే.. బెయిల్‌పై బయటకొచ్చాక.. కోర్టులో చూద్దామని కుటుంబసభ్యులు నాగరాజుకు చెప్పారు. కానీ.. ఇంతలోనే ఆయన ఏమనుకున్నారో తెలియదు.. ఏం ఆలోచించుకున్నారో తెలియదు గానీ.. జైలులోని కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

ఒక ఆత్మహత్య 10 సందేహాలు:
కీసర మాజీ తహశీల్దార్‌ నాగరాజుది ఆత్మహత్య కాదు పక్కా హత్య అని ఆరోపిస్తోంది ఆయన కుటుంబం. ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి పట్టుకున్న దగ్గరి నుంచి జైల్లో సూసైడ్‌ వరకు ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉందన్నారు. ప్రధానంగా పది సందేహాలను లేవనెత్తుతూ న్యాయ పోరాటం చేస్తామన్నారు. నాగరాజు ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ఇక ఏసీబీ అధికారులపై ఒత్తిడి చేసిన వాళ్లు ఎవరో కూడా తెలియాల్సి ఉందన్నారు.

నాగరాజుది పక్కా మర్డర్‌, టర్కీ టవల్‌తో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం?
నాగరాజును ట్రాప్‌ చేసి ఏసీబీ పట్టుకుని.. కస్టడీలో చంపేశారని ఆరోపించింది ఆయన భార్య. టర్కీ టవల్‌తో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు రెవెన్యూ వాళ్లపైనే ఎందుకిలా జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు నాగరాజు భార్య. క్యాష్‌ కట్టలు వాళ్లే తెచ్చి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని ఏసీబీ చిత్రీకరించిందని ఆరోపించింది నాగరాజు భార్య. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

నాగరాజుది పక్కా మర్డర్‌ అని ఆరోపించింది ఆయన భార్య. ఒకవేళ ఆత్మహత్య అయితే ఆధారాలు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్లు తమపై ఒత్తిడి ఉందని చెప్పారని అన్నారు నాగరాజు భార్య. ఆ వ్యక్తులు ఎవరన్నది తెలియాలన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై న్యాయపోరాటం చేస్తామన్నారు.

నాగరాజు విషయంలో ట్రాపింగ్‌తో పాటు మానిప్యూలేష్ జరిగిందన్నారు ఆయన సోదరి. అసలు క్యాష్‌ బ్యాగ్‌ తెచ్చిందెవరో చెప్పాలని డిమాండ్‌ చేశారామె. నాగరాజు అవినీతికి పాల్పడలేదని అన్నాడు ఆయన బావ. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకి అందిస్తామన్నారు. జైల్లో ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు నాగరాజు బావమరిది.

ఒక ఆత్మహత్య 10 సందేహాలు:
1. నాగరాజును ఇరికించి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు?
2. జైల్లో టర్కీ టవల్‌తో ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు?
3. ఆత్మహత్య సమయంలో నలుగురు ఉన్నారు.. వాళ్లకి సౌండ్ రాలేదా?
4. వారంలో వచ్చేస్తానన్న వ్యక్తి అంతలోనే ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు?
5. నాగరాజు సూసైడ్‌కి ఆధారాలు ఎందుకు చూపడం లేదు?
6. జైలు సిబ్బందిని గానీ, జైలర్‌ను గానీ ఎందుకు సస్పెండ్‌ చేయలేదు?
7. ఏసీబీ వాళ్లు మాపై ఒత్తిడి ఉంది అని ఎందుకు చెప్పారు?
8. ఏసీబీ అధికారులపై ఒత్తిడి చేసిన వ్యక్తులు ఎవరు?
9. రూ.కోటీ 10 లక్షలు బ్యాగ్‌లో ఎవరైనా తీసుకెళ్తారా?
10. పట్టుకున్న నగదుపై కెమికల్‌ టచ్‌ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు?