CPI (M) CC meet : హైదరాబాద్‌‌కు కేరళ సీఎం..కేసీఆర్‌‌తో లంచ్

సీపీఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన కేరళ సీఎం పినరయి విజయన్..సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు.

CPI (M) CC meet : హైదరాబాద్‌‌కు కేరళ సీఎం..కేసీఆర్‌‌తో లంచ్

Cm Kcr

Kerala CM And CM KCR : సీపీఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన కేరళ సీఎం పినరయి విజయన్..సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు. మధ్యాహ్నంకు సమయం ఇచ్చారు. వీరిద్దరూ లంచ్ కూడా చేయనున్నారు. వీరితో పాటు…సీతారాం ఏచూరి, బృందాకరత్ లు కూడా పాల్గొననున్నారు. వీరి భేటీ 2022, జనవరి 08వ తేదీ శనివారం, జనవరి 09వ తేదీ ఆదివారం జరగవచ్చని తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ కు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి..సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే.

Read More : India Covid Update : భారత్‌లో లక్ష 50 వేలకు చేరువలో కోవిడ్ కేసులు

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు కొనసాగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, బృందాకారత్ తో పాటు…పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Read More : TDP MlC Ashok Babu : ఉద్యోగులకు 4 శాతం జీతాలు తగ్గుతాయి..పే రివిజన్ కాదు, పే రివర్స్

కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చించడం జరుగుతుందని, అనంతరం ప్రజలకు విడుదల చేస్తామని..దీనికి సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలు తెలపవచ్చన్నారు ఏచూరి తెలిపారు. సవరణల అనంతరం అఖిల భారత మహాసభలో రాజకీయ నివేదిక ప్రవేశపెడుతామన్నారు.