ఖైరతాబాద్ గణేష్..భక్తులకు నో ఎంట్రీ..ఆన్ లైన్ లో పూజలు

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 10:24 AM IST
ఖైరతాబాద్ గణేష్..భక్తులకు నో ఎంట్రీ..ఆన్ లైన్ లో పూజలు

వినాయక చవితిపై కరోనా ఎఫెక్ట్ పడింది. గణేష్ పండుగ వచ్చిందంటే…చాలు..తొలుత ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో.. ఎన్నో విశేషాలు ఉండే..ఈ గణేష్ కరోనా కారణంగా..గణేష్ ఉత్సవ నిర్వాహకులు కొన్ని మార్పులు చేశారు. ఎత్తును తగ్గించేశారు.



భక్తులకు ఎలాంటి అనుమతినివ్వలేదు. సంప్రదాయం ప్రకారం..గవర్నర్ దంపతులు, ఇతర ప్రముఖులు మాత్రమే పూజలు నిర్వహించనున్నారు. 9 అడుగులు..మట్టితో తయారు చేసిన ఖైరతాబాద్ గణేష్…ఈసారి ధన్వంతరి నారాయణుడిగా దర్శనమిస్తున్నారు.

కరోనాకు వ్యాక్సిన్ తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా ఏర్పాటు చేసినట్లు, చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో గణేష్ ఉన్నాడు. ఇక వినాయకుడి కుడివైపున మహాలక్ష్మీ దేవి, ఎడమవైపున సరస్వతి విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.



వినాయక చవితి పండుగ రోజు నుంచి మొదలు..విగ్రహం నిమజ్జనం రోజు వరకు ఖైరతాబాద్ ప్రాంతం మొత్తం సందడిగా కనిపించేది. కానీ ప్రస్తుతం ఆ సీన్ లేదు. కేవలం నిర్వాహకులు, ప్రముఖులు మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు.

భక్తులకు అనుమతి లేదని, కానీ ఇక్కడకు రాకుండానే..పూజలు చేసుకొనే అవకాశం కల్పించారు. www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వాహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.



ఇక ఎప్పటిలానే…తాపేశ్వరం వారు లడ్డూనే చేసి పంపించారు. ఈ సంవత్సరం 100 కిలోల లడ్డూను ఏర్పాటు చేసింది. లడ్డూపూ వినాయకుడి ప్రతిమ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇక మట్టితో ఉన్న ఖైరతాబాద్ గణేష్…ఈ సారి అక్కడనే నిమజ్జనం చేయనున్నారు. ఇది చరిత్రలోనే తొలిసారి అని నిర్వాహకులు వెల్లడించారు.

1954 ఒక్క అడుగుతో ప్రారంభమైందని, 66 సంవత్సరం వరకు వచ్చేసరికి కరోనా కారణంగా 9 అడుగుల ఎత్తుతో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగిందంటున్నారు. ఎలాంటి ప్రసాదాలు పంపిణీ ఉండదని, కరోనాకు వ్యాక్సిన్ వచ్చే విధంగా చూడాలని గణేషుడిని కోరుకోవాలని గణేష్ ఉత్సవ నిర్వాహకులు సూచించారు.