Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్‌ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. గణేష్ అడుగులు గంగమ్మ ఒడివైపు పడుతున్నాయి. వచ్చే ఏడాది 18 తలలతో కూడిన 70 అడుగుల మట్టి మహా గణేష్ ను ఏర్పాటు చేస్తామని దానం నాగేందర్ తెలిపారు.

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం

Ganesh (4)

Khairatabad Ganesh Shobhayatra : ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. వడివడిగా గణనాథుడి అడుగులు గంగమ్మ ఒడివైపు పడుతున్నాయి. ఇక వచ్చే ఏడాది 18 తలలతో కూడిన 70 అడుగుల మట్టి మహాగణపతిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌లోనే విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని స్పష్టం చేశారు.

భక్తుల నుంచి ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి తరలుతున్నాడు. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు. భారీ గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 40 అడుగుల్లో పంచముఖ రుద్ర మహా గణపతిగా కొలువుదీరిన విఘ్నేశ్వరున్ని 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేర్చనున్నారు.

Ganesh Idols : పాతబస్తీ నుండి ట్యాంక్ బండ్ కు వెయ్యి వినాయక విగ్రహాలు

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల పొడవునా సాగనుంది. దీంతో పోలీసులు ఈ రూట్‌మ్యాప్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఎప్పటిలానే రూట్‌ మ్యాప్‌ ప్రకారం.. ద్వారకా హోటల్‌, టెలీఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, ఓల్డ్‌ సెక్రటేరియట్‌ గేట్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, లుంబినీ పార్క్‌ మీదుగా ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర జరగనుంది.

క్రేన్‌ నెంబర్‌ 6 దగ్గర హుస్సేన్‌సాగర్‌లో గణనాథుడి నిమజ్జనం జరగనుంది. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతికి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లంబోదరుడు నిమజ్జనానికి తరలించారు. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ క్రేన్‌ ద్వారా గణేశుడిని తరలిస్తున్నారు.