Google Maps : కొంపముంచిన గూగుల్.. అడ్డంగా మోసపోయి ఇంటర్ పరీక్షకు దూరమైన విద్యార్థి

గూగుల్ మ్యాప్స్.. ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్షకు దూరమయ్యేలా చేసింది. గూగుల్స్ మ్యాప్స్ ను నమ్ముకుని ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ కు బయలుదేరిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తాను చేరుకోవాల్సిన ఎగ్జామ్ సెంటర్ ఖమ్మంలో ఉంటే.. లొకేషన్ టేకులపల్లికి తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక తన పరీక్ష కేంద్రం అది కాదని తెలుసుకుని షాక్ తిన్నాడు.

Google Maps : కొంపముంచిన గూగుల్.. అడ్డంగా మోసపోయి ఇంటర్ పరీక్షకు దూరమైన విద్యార్థి

Google Maps : ఇప్పుడు అంతా టెక్నాలజీ మీదే నడుస్తోంది. టెక్నాలజీ మనిషి జీవితంలో భాగమైపోయింది. ప్రతీ పనికి టెక్నాలజీపైనే మనిషి ఆధారపడుతున్నాడు. టెక్నాలజీ కారణంగా అన్ని పనులు సులువైపోయాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో దాని మీద డిపెండ్ అవడం మంచిది కాకపోవచ్చు. కొన్నిసార్లు అది బెడిసికొట్టొచ్చు. తాజాగా ఓ విద్యార్థి విషయంలో అదే జరిగింది. గూగుల్ మ్యాప్స్ అతడి కొంపముంచింది.

సాధారణంగా కొత్త ప్రాంతాలకు లేదా తెలియని ప్రాంతానికి వెళ్లాలి అంటే.. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుంటారు. దాని మీద ఆధారపడతారు. అది చాలా కామన్. గూగుల్ మ్యాప్స్.. గమ్యస్థానానికి త్వరగా చేరుస్తుందని విశ్వసిస్తారు. అయితే, అన్ని సమయాల్లో గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకోవడం కరెక్ట్ కాకపోవచ్చు. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ కారణంగా తప్పులు జరగొచ్చు. తాజాగా ఓ ఇంటర్ విద్యార్థి విషయంలో అదే జరిగింది.

Also Read..Kim Jong Un : నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష

గూగుల్ మ్యాప్స్.. ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్షకు దూరమయ్యేలా చేసింది. గూగుల్స్ మ్యాప్స్ ను నమ్ముకుని ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ కు బయలుదేరిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తాను చేరుకోవాల్సిన ఎగ్జామ్ సెంటర్ ఖమ్మంలో ఉంటే.. లొకేషన్ టేకులపల్లికి తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక తన పరీక్ష కేంద్రం అది కాదని తెలుసుకుని షాక్ తిన్నాడు. ఆ తర్వాత తన ఎగ్జామ్ సెంటర్ చేరుకున్నాడు. కానీ, అప్పటికే బాగా ఆలస్యమైంది. ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లేసరికి 27 నిమిషాలు లేటు అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదన్న ఇంటర్ బోర్డు నిబంధనతో ఆ విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు.

Also Read..UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..

ఖమ్మం రూరల్ మండలం కొండాపురంకి చెందిన వినయ్ కి ఖమ్మం ఎన్ ఎస్పీ ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్ కి బయలుదేరాడు. అయితే, అది టేకులపల్లి కేంద్రానికి తీసుకెళ్లింది. తనకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ అది కాదని తెలుసుకుని కంగుతిన్నాడు. ఆ తర్వాత టెన్షన్ పడ్డాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. టేకులపల్లి నుంచి ఖమ్మంలో తనకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడానికి 27నిమిషాలు ఆలస్యం కావడంతో.. ఎగ్జామ్ రాసేందుకు అధికారులు వినయ్ ని అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక వినయ్ ఇంటికి తిరిగెళ్లాడు.

ముందు రోజే పరీక్షా కేంద్రం గురించి తెలుసుకుని ఉంటే.. ఈ నష్టం జరిగి ఉండేది కాదని అధికారులు విద్యార్థి దృష్టికి తెచ్చారు. ఇకపై జరిగే పరీక్షలకు జాగ్రత్త పడాలని సూచించారు.