T.Congress : కొత్తగూడెం కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ..ఇద్దరు నేతల మధ్య పోటీ..కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ Khammam Kottagudem congress  politics

T.Congress : కొత్తగూడెం కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ..ఇద్దరు నేతల మధ్య పోటీ..కార్యకర్తల్లో కన్ఫ్యూజన్

కొత్తగూడెం కాంగ్రెస్‌లో.. కొత్త పంచాయతీ మొదలైంది. కొత్తగా ఇద్దరు నేతల మధ్య పోటీ మొదలవడంతో.. కొత్త రాజకీయం కనిపిస్తోంది. ఈ లీడర్లలో.. ఎవరి వెంట వెళ్లాలో తెలియక.. కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. వారి సంగతెలా ఉన్నా.. కొత్తగూడెం టికెట్ కోసమే ఆ ఇద్దరు నాయకులు.. నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారనే విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. మరి.. వీళ్లిద్దరి వెనకున్న.. ఆ ఇద్దరెవరంటే..

T.Congress : కొత్తగూడెం కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ..ఇద్దరు నేతల మధ్య పోటీ..కార్యకర్తల్లో కన్ఫ్యూజన్

Khammam T.Congress politics : కొత్తగూడెం కాంగ్రెస్‌లో.. కొత్త పంచాయతీ మొదలైంది. కొత్తగా ఇద్దరు నేతల మధ్య పోటీ మొదలవడంతో.. కొత్త రాజకీయం కనిపిస్తోంది. ఈ లీడర్లలో.. ఎవరి వెంట వెళ్లాలో తెలియక.. కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది. వారి సంగతెలా ఉన్నా.. కొత్తగూడెం టికెట్ కోసమే ఆ ఇద్దరు నాయకులు.. నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారనే విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. మరి.. వీళ్లిద్దరి వెనకున్న.. ఆ ఇద్దరెవరు?

ఇంతకాలం.. సాదా సీదాగా ఉన్న కొత్తగూడెం కాంగ్రెస్‌లోకి.. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చారు. అంతే.. కొత్తగూడెంలో కొత్త పొలిటికల్ హీట్ రేగింది. ఇప్పటికే.. అక్కడ ఎడవల్లి కృష్ణ పనిచేసుకుంటుండటం.. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో పోట్ల ఎంట్రీ ఇవ్వడంతో.. సీన్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్ కారెక్కడంతో.. లోకల్ కాంగ్రెస్‌లో కాక రేగింది. వనమా పార్టీని వీడటంతో.. అప్పటి నుంచి ఎడవల్లి కృష్ణ కొత్తగూడెం కాంగ్రెస్ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఇదిలా కంటిన్యూ అవుతున్న టైంలో.. సడన్‌గా మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చారు. వనమా పార్టీ మారిపోయారు. పైగా.. కొత్తగూడెం జనరల్ సీటు. ఇంకేముంది.. ఏమీ లేదు. జనానికి దగ్గరవ్వడమే మిగిలింది. అందుకే.. పోట్ల గ్రౌండ్ లెవెల్‌లో జనానికి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది.

Also read : AP politics : మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్త బాధ్యతలతో తల పట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. దీనిని.. రీచ్ అయ్యేందుకు.. గట్టి కేడర్, అంతకుమించి.. ఖర్చు పెట్టగల రేంజ్ ఉన్న లీడర్ల కోసం పీసీసీ వెతుకుతున్నట్లు.. గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ కెపాసిటీ పోట్ల నాగేశ్వరరావుకు ఉందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు.. ఇప్పటి నుంచే నియోజకవర్గంలో టూర్లు వేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు.. కొత్తగూడెంలో క్యాంప్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేశారు. లోకల్ కాంగ్రెస్ సీనియర్లు, కార్యకర్తలతో.. తరచుగా మీటింగ్స్ పెడుతుండటంతో.. ఎడవల్లి వర్గం ఆగ్రహంతో ఊగిపోతోందట.

కొత్తగూడెంలో ఎడవల్లి కృష్ణ బలమైన కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరుంది. వనమా పార్టీ మారాక.. అన్ని తానై నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు.. పోట్ల నాగేశ్వరరావు వచ్చి.. కొత్తగూడెంలో పర్యటించడం, క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయడంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. మూడేళ్లుగా.. కనిపించని నేత.. ఇప్పుడు ఇక్కడెలా తిరుగుతారని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అయితే.. కాస్త లోతుల్లోకి వెళితే తెలిసిందేమిటంటే.. ఎడవల్లి కృష్ణ.. రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆమె.. ఇన్ డైరెక్ట్‌గా రేవంత్‌కు మద్దతిస్తోందని పార్టీలో అందరికీ తెలుసు. మరో పాయింట్ ఏమిటంటే.. కొత్తగూడెంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పోట్ల నాగేశ్వరరావు.. భట్టి వర్గం. దీంతో.. కొత్తగూడెం పంచాయితీ.. కొన్ని దశలను దాటుకొని.. మళ్లీ రేవంత్ వర్సెస్ భట్టి అన్నట్లుగా మారిపోయిందని.. కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

Also read : Telangana Congress : టీ.కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన కోవర్టుల గోల..వార్నింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరికి అస్సలు పడట్లేదు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని.. వాళ్లిద్దరికే కాదు.. పార్టీలో ఉన్నోళ్లందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగూడెంలోనూ.. కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో.. అంతా కలిసిక్టటుగా పనిచేయాలని.. అగ్ర నేతలు చెబుతుంటే.. గ్రూపులుగా విడిపోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుండటంతో.. కిందిస్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా.. కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే.. తప్పదు భారీ మూల్యం అంటున్నారు.

×