Khanamet e-Auction: ఖానామెట్ ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.55 కోట్లు

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల వేలం జరిగింది. ఖానామెట్ పరిధిలోని భూములైన 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు.

Khanamet e-Auction: ఖానామెట్ ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.55 కోట్లు

Khanamet (1)

Khanamet e-Auction: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల వేలం జరిగింది. ఖానామెట్ పరిధిలోని భూములైన 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ప్రస్తుతం పలికిన ధరలు కోకాపేట కంటే ఎక్కువ పలికినట్లు రికార్డులు చెబుతున్నాయి.

మొత్తం 15 ఎకరాలకు నిర్వహించిన వేలంలో 729.41కోట్ల ఆదాయం రాగా, ఎకరం సగటున 48.6కోట్లుగా ధర పలికింది. అత్యధికంగా 55 కోట్ల రూపాయల వరకూ పోయింది ఒక ఎకరం ధర. కనీస ధర ఎకరం రూ.25కోట్లు నిర్ణయించగా రూ.20లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్లారు.

శుక్రవారం ఉదయం 9గంటల నుంచి వేలం కార్యక్రమం జరిగింది. ఈ వేలంతో మొత్తం రూ.729.41కోట్ల రెవెన్యూ ప్రొడ్యూస్ అవుతుంది. హైదరాబాద్ లోని వనరులు పెంచుకునేందుకు, డెవలప్ చేసుకునేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు.

E Auction

E Auction