Dharani Reddy: ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న కిలాడీ లేడి బాధితులు.. రూ.7 లక్షలు ఇచ్చిన ఖమ్మం జిల్లా వ్యక్తి

పెళ్లి సంబంధాల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు గుంజుతూ నల్గొండలో శనివారం అరెస్ట్ అయిన మాయలేడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెళ్లి కాని యువతి యువకులను టార్గెట్ చేసుకొని కోట్లలో మోసం చేసిన మహేశ్వరి అలియాస్ ధరణిరెడ్డి మోసాల చిట్టా భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది.

Dharani Reddy: ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న కిలాడీ లేడి బాధితులు.. రూ.7 లక్షలు ఇచ్చిన ఖమ్మం జిల్లా వ్యక్తి

Dharani Reddy

Dharani Reddy: పెళ్లి సంబంధాల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు గుంజుతూ నల్గొండలో శనివారం అరెస్ట్ అయిన మాయలేడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెళ్లి కాని యువతి యువకులను టార్గెట్ చేసుకొని కోట్లలో మోసం చేసిన మహేశ్వరి అలియాస్ ధరణిరెడ్డి మోసాల చిట్టా భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కూడా ఓ కుటుంబాన్ని దారుణంగా మోసం చేసింది ధరణిరెడ్డి. మండలంలోని మర్లపాడుకు చెందిన ఓ వ్యక్తి గతేడాది సత్తుపల్లిలో ఓ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ అతడికి మహేశ్వరిని పరిచయం అయింది. అక్కడే అతడు తన రెండవ కూతురు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో మాయలేడి అతడితో మాటలు కలిపి మంచి సంబంధం ఉందని చెప్పింది.

మిర్యాలగూడకు చెందిన అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని సదరు వ్యక్తికీ తెలిపింది. ఆలా అతడి ఫోన్ నంబర్ తీసుకుంది. ఫోన్ లో వారం రోజులపాటు పెళ్లి గురించి మాట్లాడింది. కట్నకానుకలు విషయాలు తెలుసుకుంది. సరిగా పరిచయమైనా వారానికి ఓ వ్యక్తి ఫోటో పంపి ఇతడే పెళ్లి కొడుకు అని నమ్మబలికింది. అబ్బాయి అందంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఒకే చెప్పారు. ఇక అప్పుడే ఆమె అసలు రూపం బయటపెట్టింది. మెల్లగా కారణాలు చెబుతూ యువతి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు లాగడం మొదలు పెట్టింది.

మరో నాలుగు రోజుల్లో నిశ్చితార్దానికి వస్తారని ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు పంపాలని కోరింది. ఆ తర్వాత మూడు రోజులకు ఫోన్ చేసి యువకుడి తాత చనిపోయారని ఇప్పుడు నిశ్చితార్థం కుదరదని తెలిపింది. 20 రోజులకు తిరిగి ఫోన్ చేసి నిశ్చితార్దానికి వస్తున్నారని ఆడపిల్లలకు చీరలు కొనాలని మరో లక్ష 50 వేలు లాగింది.

యువతి కుటుంబాన్ని నమ్మించేందుకు వేరే వ్యక్తులతో పెళ్లికొడుకులా మాట్లాడించేది.. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె మోసం చేస్తుంది అనే విషయం గుర్తించలేకపోయారు. ఇక ఉంగరాలు మార్చుకోవాలంటూ మరో లక్ష వసూలు చేసింది. ఆ తర్వాత పెళ్లికొడుకుగా చెప్పుకుంటున్న కృష్ణ హర్ష అనే వ్యక్తితో ఫోన్ చేయించి మీ ఇల్లుబాలేదని డెకరేషన్ కోసం సామాను పంపుతామని చెప్పి మరో లక్ష లాగారు.

ఇదిలా ఉంటే గత ఏడాది ఆగస్టు 7 అమ్మాయి బాబాయికి పిడ్స్ రావడంతో ఖమ్మంలోని ఆసుపత్రిలో చేర్చారు.. ఇక్కడకూడా మానవత్వం చూపని సదరు కిలాడీ లేడి.. హైదరాబాద్ లో తెలిసిన డాక్టర్ ఉన్నాడు ఆపరేషన్ చేయిస్తానని చెప్పి 2 లక్షల రూపాయలు గుంజింది. డబ్బు తీసుకోని సదరు మహిళా అక్కడినుంచి ఉడాయించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి నిలదీసే ప్రయత్నం చేశారు.. కానీ కిలాడీ లేడి ధరణిరెడ్డి అమ్మాయి కుటుంబ సభ్యులనే బెదిరించింది. తమ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని.. విషయం ఇంతటితో వదిలేస్తే మంచిదని తెలిపింది.

దీంతో బాధితులు గతేడాది నవంబర్ 25 న వేంసూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మొత్తం అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ఈ కిలాడీ లేడి పెళ్లి పేరుతో 5లక్షల రూపాయాలు, వైద్యం పేరుతో 2 లక్షలు మొత్తం 7 లక్షలు కాజేసింది. ఇంకా ఈమె బాధితులు చాలామందే ఉన్నట్లు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లుగా సమాచారం. బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.