ఈవీఎంలు పెట్టమని మా పార్టీ చెప్పినా బ్యాలెట్ బాక్సులే పెట్టారు: కిషన్ రెడ్డి

  • Published By: Mahesh ,Published On : December 1, 2020 / 07:49 PM IST
ఈవీఎంలు పెట్టమని మా పార్టీ చెప్పినా బ్యాలెట్ బాక్సులే పెట్టారు: కిషన్ రెడ్డి

GHMC Election: గ్రేటర్ ఎన్నికల అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో బండి సంజయ్‌తో పాటు పాల్గొన్న మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గడంపై ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. తమ పార్టీనే మేయర్ పీఠం అధిష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బ్యాలెట్ బాక్సులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. మా పార్టీ స్పష్టంగా చెప్పింది ఈవీఎమ్ ఉండాలని. వారికి అనుకూలంగా మార్చుకునేందుకే బ్యాలెట్ పెట్టారా అనేది వెయ్యి డాలర్ల సమస్య. వరద బాధితులకు రూ.పది వేలు ఇవ్వాలనుకున్నాం. ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఎన్నికలు పెట్టాల్సింది.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

ఎన్నికల్లో బండి సంజయ్ చెప్పినట్లు కార్యకర్తలు వీరోచితంగా పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్‌ను నిర్వీర్యం చేసేందుకు సీఎం, ఆయన కొడుకు ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో విపరీతంగా మద్యం పంపిణీ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఇవన్నీ జరిగాయి. నిష్ఫక్షిపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో వ్యవహరించింది.

సీఎంగా ఉన్న వ్యక్తి అబద్ధాలు ప్రచారం చేయడం, ప్రజలను ఓటింగ్ కు దూరంగా ఉంచేలా వ్యవహరించారు. ఆయనే స్వయంగా విధ్వంసం జరుగుతుంది. అరాచకం జరుగుతుంది. అని ఆరోపణలు చేశారు. ఓల్డ్ మలక్ పేట్ డివిజన్లో గుర్తులు తారుమరై మళ్లీ జరిగేలా అయింది. సోషల్ మీడియాలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేసింది.