Kishan Reddy : బూస్టర్ డోసు తప్పక తీసుకోండి.. పుకార్లను నమ్మొద్దు : కిషన్ రెడ్డి

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొవిడ్ మూడో వేవ్ ప్రభావం పెరుగుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా కరోనా విజృంభిస్తోంది.

Kishan Reddy : బూస్టర్ డోసు తప్పక తీసుకోండి.. పుకార్లను నమ్మొద్దు : కిషన్ రెడ్డి

Kishan Reddy Minister Kishan Reddy Inspects Booster Dose Vaccination In Gandhi Hospital

Kishan Reddy : దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొవిడ్ మూడో వేవ్ ప్రభావం పెరుగుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా కరోనా విజృంభిస్తోంది. కరోనా మూడో వేవ్ కూడా మొదలు కావడవంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రెండు డోసులు తీసుకున్నవారికి ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు వైద్యనిపుణులు. అయితే ప్రస్తుత కరోనా మూడో వేవ్ దృష్ట్యా మూడో డోసు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.

గాంధీ హాస్పిటల్‌లో బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ సెంటర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడో డోసు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. దేశంలో మూడో వేవ్ ప్రభావం పెరిగిందన్నారు. అదృష్టం కొద్దీ.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి రిస్క్ లేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే.. మూడో వేవ్ నుంచి తప్పకుండా బయటపడతామని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్ సమయంలో దీర్ఘకాలిక రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీనియర్ సిటీజన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఈ రోజు (సోమవారం) నుంచి దేశంలో మూడో డోస్ స్టార్ట్ అయిందని చెప్పారు. ఈ బూస్టర్ డోసును కేంద్రం ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం పరంగా బెడ్స్, ఆక్సిజన్, మెడిషన్ అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా కట్టడిపై కేంద్రం కమిటీ వేసిందని, అందులో తాను కూడా ఉన్నట్టు చెప్పారు. ఈ కొత్త వేరియంట్ మెడిషన్‌ను మన దేశంలోనే తయారు చేస్తున్నమని, టీకా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చెయ్యకుండా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా‌లో పుకార్లు నమ్మవద్దనని మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

Read Also : Esha Chawla : కరోనా బారిన సెలబ్రిటీలు.. మరో హీరోయిన్ ఇషాచావ్లాకి పాజిటివ్