Kitex Telangana : 22వేల ఉద్యోగాలు.. తెలంగాణ‌కు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలు స్థాపించేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో పరిశ్రమ భారీ పెట్టుబ‌డి..

Kitex Telangana : 22వేల ఉద్యోగాలు.. తెలంగాణ‌కు మరో భారీ పెట్టుబడి

Kitex Telangana

Kitex Telangana : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలు స్థాపించేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో పరిశ్రమ భారీ పెట్టుబ‌డి పెడుతోంది. కేర‌ళ‌కు చెందిన వ‌స్త్ర‌ త‌యారీ ప‌రిశ్ర‌మ కైటెక్స్ గ్రూప్ వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ టెక్స్‌టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చంద‌న్‌వెల్లి సీతారామ్‌పూర్‌లో ప్లాంటు ఏర్పాటుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం, కైటెక్స్ గ్రూప్ మ‌ధ్య శ‌నివారం అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్, కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాక‌బ్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చిన కైటెక్స్ గ్రూప్‌కు మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రూ. 2,400 కోట్ల పెట్టుబ‌డి పెట్టాల‌ని కైటెక్స్ గ్రూప్ నిర్ణ‌యించిందన్నారు. దీంతో 22 వేల మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి, మ‌రో 18 వేల మందికి ప‌రోక్ష ఉపాధి ల‌భించ‌నుందన్నారు. కైటెక్స్ ప‌రిశ్ర‌మ‌లో 85 నుంచి
90 శాతం మ‌హిళ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండే ప‌త్తిని కైటెక్స్ కొనుగోలు చేయ‌నుంద‌ని తెలిపారు. సీఎస్ఆర్ కింద రూ.6 కోట్ల విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్ ఇవ్వ‌నుందన్నారు.

Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

”వ‌చ్చే నవంబ‌ర్ నుంచి కైటెక్స్ గ్రూప్ త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్రారంభించ‌నుంది. ఇత‌ర రాష్ట్రాలు కైటెక్స్‌ను ఆహ్వానించినా.. రాష్ట్రం నుంచి ప్ర‌త్యేకంగా విమానం ఏర్పాటు చేసి ఆహ్వానించాము. ఆ త‌ర్వాత పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను వివ‌రించాము” అని కేటీఆర్ తెలిపారు.

మంత్రి కేటీఆర్ చూపిన చొర‌వ వ‌ల్లే తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెడుతున్నామ‌ని కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాక‌బ్ తెలిపారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల అనుకూల వాతావ‌ర‌ణం, విధానాలు న‌చ్చాయ‌ని చెపపారు. 3 మిలియ‌న్ దుస్తుల‌ను ఉత్పత్తి చేసి ఇత‌ర రాష్ట్రాలు, దేశాల‌కు ఎగుమ‌తి చేస్తామ‌ని సాబూ ఎం జాక‌బ్ వెల్లడించారు.

తెలంగాణకు వరుసగా బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీగా పెట్టుబడి(రూ.750 కోట్లు) పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడితో తెలంగాణలో గోల్డ్ డైమండ్ జువెలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీని ఏర్పాటు చేయనుంది మలబార్ గ్రూప్. దీని ద్వారా రాష్ట్రంలోని 2వేల 500 మందికి పైగా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశం లభించనుంది.