Kokapet Lands : నేడే మహా వేలం.. ఎకరం రూ.25 కోట్లు

మహా వేలానికి వేళయింది. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట భూముల వేలంతో రియల్ మార్కెట్ మరో మెయిలు రాయిని అందుకోనుంది. నియో పోలీస్ పేరుతో హెచ్ఎండీఏ, ఎంఎస్టీసీలు సంయుక్తంగా ఆన్ లైన్ లో వేలం పాట నిర్వహిస్తున్నారు. కోకాపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 109, 239, 240లో ఉన్న భూముల్లో 49.94 ఎకరాలను 8 ప్లాట్లుగా విభజించి వేలంలో పెడుతున్నారు.

Kokapet Lands : నేడే మహా వేలం.. ఎకరం రూ.25 కోట్లు

Kokapet Lands

Kokapet Lands : మహా వేలానికి వేళయింది. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట భూముల వేలంతో రియల్ మార్కెట్ మరో మెయిలు రాయిని అందుకోనుంది. నియో పోలీస్ పేరుతో హెచ్ఎండీఏ, ఎంఎస్టీసీలు సంయుక్తంగా ఆన్ లైన్ లో వేలం పాట నిర్వహిస్తున్నారు. కోకాపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 109, 239, 240లో ఉన్న భూముల్లో 49.94 ఎకరాలను 8 ప్లాట్లుగా విభజించి వేలంలో పెడుతున్నారు.

సువిశాల రోడ్లతో అభివృద్ధి చేసిన నియో పోలీస్ లేఅవుట్లతోపాటు, గోల్డెన్ మెయిల్ లేఅవుట్ ప్లాట్లను ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇక్కడ భారీ భవనాలు నిర్మించేలా విశాలమైన రోడ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, తాగు నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. కనుచూపు మేరలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ భూములను అభివృద్ధి చేస్తున్నారు.

ఒక్కో ఎకరం కనీస ధర కనీసం రూ.25 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కానీ కోకాపేట ల్యాండ్స్ కు ఉన్న డిమాండ్ చేస్తుంటే అంతకు రెట్టింపు ధర పలికే అవకాశం ఉంది. ఈ వేలం ద్వారా రూ.2500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక అమీర్ పెట్ లో ఉన్న హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం నుంచి ఈ-వేలం ద్వారా భూముల అమ్మకాలు జరపనున్నారు. ఈ వేలంలో 60 మంది బిడ్డర్లు పాల్గొననున్నారు.