Rajagopal Reddy joined BJP : బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఆత్మగౌరవ' సభ సాక్షిగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి రాజగోపాల్‌రెడ్డిని అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. కేసీఆర్ ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజగోపాల్‌రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Rajagopal Reddy joined BJP : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఆత్మగౌరవ’ సభ సాక్షిగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి రాజగోపాల్‌రెడ్డిని అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. కేసీఆర్ ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజగోపాల్‌రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మనం వేసే ఈ అడుగు తెలంగాణ భవిష్యత్ కోసమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని చెప్పారు. ఒక పార్టీలో గెల్చి ఇంకో పార్టీ కండువా కప్పుకుంటున్నారు..నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. తాను అలాంటి తప్పు చేయడం లేదన్నారు. తాను అమ్ముడుపోయానని చెబుతున్నారు..తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాను..తనను కొనేవాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ లేరన్నారు.

Amit Shah On Dalit CM : టీఆర్ఎస్‌ను గెలిపిస్తే దళితుడు సీఎం కాడు.. కేటీఆర్ సీఎం అవుతాడు-అమిత్ షా

రాజీనామా ఎందుకు చేశావని ప్రశ్నిస్తున్నారు..మూడున్నరేళ్లు మునుగోడు అభివృద్ధి కోసం ప్రయత్నించా…ఎన్నోసార్లు అడిగినా సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రజల కోసం తాను రాజీనామా చేశానని తెలిపారు. తన రాజీనామాతో సీఎం మునుగోడుకు వచ్చారు..తన రాజీనామాలో స్వార్థం లేదన్నారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కాపాడుకుందామని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు