KomatiReddy VenkatReddy: వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భవిష్యత్తు రాజకీయాలపై స్పందించారు. తాను నల్గొండ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో నల్గొండలో పర్యటిస్తానని తెలిపారు.

KomatiReddy VenkatReddy:

గజ్వేల్, సిద్ధిపేటలా నల్గొండను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ఆయన నిలదీశారు. కేసీఆర్ దత్తత తీసుకున్నా నల్గొండను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. నల్గొండలో తాను చేసిన అభివృద్ధే తప్ప ఇతర ఏ అభివృద్ధీ లేదని చెప్పారు. నిన్న కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీలో తమ పేరు లేకపోతే మరో పై స్థాయి కమిటీలో తన పేరు ఉండొచ్చని చెప్పారు.

తాను మంత్రి పదవినే వదిలేశానని అన్నారు. ఇక ఇతర పదవులు తనకు ముఖ్యం కాదని తెలిపారు. తనకు అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉన్నానని చెప్పడం గమనార్హం. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం దూరం పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉన్నానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

Puppies Confuse: కోడిపెట్టను తమ తల్లి అనుకున్న కుక్క పిల్లలు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు