Konda Murali : నన్ను అనవసరంగా గెలికితే క్రేన్‌కు వేలాడదీస్తా : కొండా మురళి వార్నింగ్

కాంగ్రెస్ లోకి కొంతమంది కొత్త కోడళ్లు వస్తుంటారు..అటువంటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చినా... ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఈ సీటు కొండా సురేఖదే..ఇక్కడి నుంచి గెలిచేది కొండా సురేఖే అంటూ అంటూ ధీమా వ్యక్తంచేశారు.

Konda Murali : నన్ను అనవసరంగా గెలికితే క్రేన్‌కు వేలాడదీస్తా : కొండా మురళి వార్నింగ్

Konda Murali..Konda surekha (1)

Konda Murali..Konda surekha : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి కుమ్ములాటలు రోడ్డుకెక్కాయి. ఎన్నికల సమీపిస్తున్న వేళ స్థానికంగా  టికెట్ దక్కించుకోవటం కోసం  నేతలు పోటీ పడుతున్నారు. నాది అంటే నాది అంటూ పోటీపడుతు వర్గపోరుతో వీధిన పడుతున్నారు. తాజాగా వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో  రచ్చ రచ్చ చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు సర్వసాధారణమే అనేలా వరంగల్  ఘటన కనిపిస్తోంది.

 

గురువారం (మే 31,2023) వరంగల్ లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకార కార్యక్రమంలో రసాభాస జరిగింది. కొండా సురేఖ దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు చెప్పులతో కొట్టుకున్నారు.స్వర్ణ,సురేఖల ముందు ముష్టియుద్దాలకు దిగారు. ఇష్టానుసారంగా చెప్పులతో కొట్టుకుని నానా రచ్చా చేశారు. స్థానిక టికెట్ కోసమే ఈ కుమ్ములాటలు అనే విషయం తెలుస్తోంది.

 

ఈ ఘటనపై కొండా సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. పరోక్షంగా ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులపై సెటైర్లు వేశారు. స్ట్రాంగ్ వార్నింగ్ లు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ లోకి కొంతమంది కొత్త కోడళ్లు వస్తుంటారు..అటువంటివారితో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలంటూ ఓ పక్క సెటైర్లు మరోపక్క సూచనలు చేశారు. ఎవరు వచ్చినా… ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఈ సీటు కొండా సురేఖదే..ఇక్కడి నుంచి గెలిచేది కొండా సురేఖే అంటూ ధీమా వ్యక్తంచేశారు.నన్ను అనవసరంగా గెలికొద్దు కాదూ కూడదు గెలుకుతాం అంటూ పాత కొండా మురళి పటేల్ బయటకు వస్తాడంటూ హెచ్చరికలు చేశారు. నా కార్యకర్తలను గెలికితే క్రేన్ కు వేలాడదీస్తా అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.