Koora Rajanna: పోలీసుల తీరుపై జనశక్తి నేత కూర రాజన్న సంచలన వ్యాఖ్యలు
తమను మళ్లీ అడవిలోకి వెళ్లే విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Koora Rajanna
Koora Rajanna – Police: పొలీసుల తీరుపై సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆ జిల్లాలో తాను కూడా ఉద్యమకారుడి పాత్ర పోషించానని తెలిపారు.
తనకు ఇక్కడ ఇల్లు లేదని చెప్పారు. తన ఆరోగ్యం బాగా లేదని , ఇటువంటి సమయంలో ఒక స్నేహితుడు తనకు సాయం చేసినందుకు అతనిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తాను వేములవాడ సత్రంలో ఉంటున్నందుకు తనను పొలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
తన నుంచి ఎటువంటి సమస్యలూ ఉండవని కూడా చెప్పానని, అయినప్పటికీ వదలట్లేరని అన్నారు. తమను మళ్లీ అడవిలోకి వెళ్లే విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరికి గులాం చేస్తున్నారని నిలదీశారు. తమకు మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని అన్నారు. తాము అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చామని చెప్పారు. ముఖ్యంగా
ఇద్దరు పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
Odisha Train Accident: రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని అసత్యాలు చెప్పి పరిహారాన్ని…