Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా ప్రాజెక్టులు

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. జూరాల ఎప్పుడో నిండిపోగా శ్రీశైలం ఐదు రోజుల క్రితం నిండింది. ఇప్పుడు సాగర్‌ కూడా నిండిపోయింది. జూరాలకు ఇప్పటికీ 4.38 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 4.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి కూడా దాదాపు 5లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

10TV Telugu News

Krishna River : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. జూరాల ఎప్పుడో నిండిపోగా శ్రీశైలం ఐదు రోజుల క్రితం నిండింది. ఇప్పుడు సాగర్‌ కూడా నిండిపోయింది. జూరాలకు ఇప్పటికీ 4.38 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 4.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి కూడా దాదాపు 5లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

10గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్‌ గేట్లు 14గేట్లు కూడా తెరిచారు. 14 గెట్లు తెరవడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే వరద పోటెత్తుడడంతో ఇవాళ మిగిలిన గెట్లను కూడా తెరిచే అవకాశాలున్నాయి. సాగర్‌ కూడా నిండటంతో కృష్ణమ్మ దిగువకు పరుగులు తీస్తోంది. పులిచింతల ఇప్పటికే నిండింది. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లే సముద్రంలోకి వెళ్లిపోనుంది.

ఎగువరాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఈ సారి కృష్ణా నదికి ముందే జలకళ వచ్చింది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండడంతో వచ్చిన వదరను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. గత నెల 28న శ్రీశైలంలో గేట్లు ఎత్తాక సాగర్‌ వైపు బిరబిరా దూసుకొచ్చాయి కృష్ణా జలాలు. దీంతో నాలుగురోజులకే సాగర్‌ నిండుకుండలా మారింది.

నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 584 అడుగులకు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 282 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 5 లక్షల 18 వేల క్యూసెక్కులుగా ఉంది. గంట గంటకు వరద పెరుగుతుండడంతో.. అధికారులు 14 క్రస్టు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తారు. లక్ష 5 వేల క్యూసెక్కుల నీరును దిగువకు వదులుతున్నారు.

శ్రీశైలం గేట్లు తెరవడంతో పర్యాటకులు పోటెత్తారు. దీంతో ఘాట్‌రోడ్‌లో మధ్యాహ్నం నుంచి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

10TV Telugu News