Pilligudiselu : 288 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభోత్సవం

అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, మూడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూంలను తొందరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.

Pilligudiselu : 288 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభోత్సవం

Ktr

KT Rama Rao : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ..నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఇళ్ల ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా..చంచల్ గూడలోని ప్రాంతంలోని నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన వారికి అందచేసింది. 2021, ఆగస్టు 28వ తేదీ శనివారం ఉదయం ఈ ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.

Read More : Chanchalguda 2bHK : చంచల్ గూడ జైలును తరలించాలన్న ఎంపీ అసదుద్దీన్

135 మంది లబ్దిదారులకు పట్టాలు అందించారు. ప్రారంభోత్సవం అనంతరం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ నాణ్యతను, గదులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఒకటిన్నర ఎకరాల్లో 24.91 కోట్లతో 9 అంతస్థుల్లో 288 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, అంతేగాకుండా..ఇక్కడ లబ్దిదారుల సౌకర్యార్థం, నిర్వహణ కోసం 19 దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, మూడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూంలను తొందరలోనే పూర్తి చేస్తామని హామీనిచ్చారు.

Read More :Dengue:హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో డెంగ్యూ ప్రభావం.. కారణం కుండలే!

దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు లేవని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ లేకుండా…నిర్మించడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రజల సౌకర్యార్థం 19 దుకాణాలను కూడా నిర్మించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నాలుగు కొత్త ఆసుపత్రులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. కరోనా వైరస్, డెంగ్యూ, తదితర సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Read More : Pawan Kalyan: గబ్బర్ సింగ్ మళ్ళీ రిలీజ్.. థియేటర్లలోనే బర్త్‌డే వేడుకలు!

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేనిపక్షంలో రోగాల బారిన పడుతామన్నారు. మూసీ పరివాహకంలో పనులను ప్రారంభించినట్లు..త్వరలోనే..ఎస్టీపీలను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇక వరంగల్ లోని జైల్ ను తరలించినట్లు చంచల్ గూడ జైలును కూడా తరలించాలని ఎంపీ అసద్ కోరుతున్నట్లు…వారి విజ్ఞప్తి మేరకు తాను హోం మంత్రితో కలిసి..సీఎం కేసీఆర్ ను కలిసి ఈ విషయాన్ని వెల్లడిస్తామన్నారు.