సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్..?

సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్..?

ktr all set to take over as cm: ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. దీంతో బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అరెంజ్ మెంట్స్ చేస్తున్నాయి. కేటీఆర్ కు తెలంగాణ సీఎంగా పగ్గాలు అప్పగిస్తారని ఊహాగానాలు వెలువడుతున్న వేళ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కు ఇదే చివరి బర్త్ డే కావొచ్చనే అంచనాలతో నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పలువురు పార్టీ నేతలు కేసీఆర్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఆదిశ్రావణ యాగం నిర్వహించేందుకు స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటాలాగే ఈసారి కూడా జలవిహార్ లో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు మంత్రి తలసాని ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటవుతున్నాయి.

అదే సమయంలో మరో వార్త కూడా వినిపిస్తోంది. సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకానికి మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఉగాది వరకు కేటీఆర్ కు అవకాశం ఉండకపోవచ్చని కొందరు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికలు, సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో పట్టాభిషేకం ఇప్పట్లో ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని సీఎం హోదాలో కేసీఆరే చేస్తారని ఆ తర్వాతే కేటీఆర్ పట్టాభిషేకం పై స్పష్టత వచ్చే చాన్స్ ఉందని నేతలు చెబుతున్నారు. మొత్తంగా కేటీఆర్ ను సీఎం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను పార్టీ శ్రేణులు పెద్దఎత్తున గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.