KTR – Birthday: కేటీఆర్ బర్త్ డే.. ముక్కోటి వృక్షార్చన

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు.

KTR – Birthday: కేటీఆర్ బర్త్ డే.. ముక్కోటి వృక్షార్చన

Ktr Birthday Plantation

KTR – Birthday: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఎంపీ సంతోష్ కుమార్.

ముక్కోటి వృక్షార్చన పేరుతో.. మూడు కోట్ల ముప్పై లక్షల మొక్కలు నాటి.. కేటీఆర్‌కు జన్మదిన కానుకగా ఇస్తున్నారు. ఇవాళ ఉదయం.. 10 గంటలకు ముక్కోటి వృక్షార్చన ప్రారంభం కానుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు మొక్కలు నాటేందుకు కావాల్సిన గోతులు తీయడంతో పాటు మొక్కలను కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల సర్పంచ్‌లు 2 కోట్ల మొక్కలు.. GHMC మేయర్‌, కార్పొరేటర్‌లు… హైదరాబాద్‌ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు, 142 మున్సిపాలిటీలలో చైర్మన్‌లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షల మొక్కలు నాటనున్నారు. వీటితో పాటు అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిపి 20 లక్షల మొక్కలు, అటవీశాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు, HMDA పరిధిలో 20 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు.

మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలోనే 10 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు అయ్యాయి. ముందుగా ఒక్క గంటలోనే మూడు కోట్ల 30 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నా.. భారీ వర్షాల కారణంగా దీన్ని సడలించి రోజు మొత్తంలో మొక్కలు నాటొచ్చని ప్రకటించారు.