KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు | KTR Davos Tour, Telangana Attracts Huge Investments

KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చివరి రోజు కూడా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.(KTR Davos Tour)

KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు

KTR Davos Tour : ప్రపంచ వాణిజ్య రాజధాని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చివరి రోజు కూడా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

రసాయన, ఔషధ, ఆహారం, విద్యుత్ రంగ పరిశ్రమలకు అవసరమయ్యే పరికరాలను ఉత్పత్తి చేయడంలో గ్లోబల్ లీడర్ గా ఉన్న జీఎంఎం ఫాడులర్ హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ లోనూ భాగస్వామిగా ఉండటానికి ముందుకొచ్చింది. గ్లాస్ లైన్ పరికరాల ఉత్పత్తి కోసం 37 లక్షల డాలర్లతో తన రెండో యూనిట్ ను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్‌ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద

ఇక దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయబోతున్న మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వామ్యం అయ్యేందుకు హ్యూందాయ్ కంపెనీ భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. రూ.1400 కోట్లు.. మొబిలిటీ క్లస్టర్ లో పెట్టుబడిగా పెట్టనుంది.(KTR Davos Tour)

హ్యుందాయ్ గ్రూప్ తెలంగాణలో రూ. 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో హ్యుందాయ్ సీఈవో యంగ్చోచి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్ లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఎకో సిస్టమ్ అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపైనా విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుందాయ్‌ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్‌ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హ్యుందాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

స్వీడన్ కు చెందిన ఈఎంపీఈ కంపెనీ.. టీబీ డయాగ్నస్టిక్ కిట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ.. జీనోమ్ వ్యాలీలో తన డయాగ్నోస్టిక్ కిట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇన్నోవేషన్ రంగం బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేటీఆర్. భవిష్యత్తులో స్టార్టప్ లకు.. హైదరాబాద్ రాజధానిగా మారనుందని కేటీఆర్ చెప్పారు. మొత్తంగా తెలంగాణ‌కు భారీగా పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు దావోస్ వేదికగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కేటీఆర్ తీవ్ర‌మైన కృషి చేస్తున్నారు.

తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రిస్తుండటంతో.. ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. ఇప్ప‌టికే వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీలు సిద్ధ‌మ‌య్యాయి. ఇందుకు సంబంధించిన ఎంవోయూల‌ను కూడా కుదుర్చుకున్నాయి.

×