KTR: అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత చీరలు అందించిన కేటీఆర్

అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత చీరలు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు జీతాలు రివైజ్ చేసి, ఆయాలకు వేతనాన్ని మూడింతలు చేస్తూ.. పీఆర్సీని 30శాతం..

KTR: అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత చీరలు అందించిన కేటీఆర్

Ktr

KTR: అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత చీరలు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు జీతాలు రివైజ్ చేసి, ఆయాలకు వేతనాన్ని మూడింతలు చేస్తూ.. పీఆర్సీని 30శాతం పెంచారు. అదే సమయంలో దీంతో పాటుగా నేత వస్త్రాలను ప్రమోట్ చేసే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 67వేల 411మంది అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు చీరలు పంపిణీ చేయనున్నారు.

హ్యాండ్‌లూమ్స్ మినిష్టర్ కేటీ రామారావు, మంత్రి సత్యవతి రాథోడ్ లు ప్రగతి భవన్ వేదికగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్స్ తయారుచేసిన జ్యూట్ బ్యాగ్స్ ను కూడా మంత్రి కేటీఆర్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31వేల 711 అంగన్వాడీ సెంటర్లతో పాటు, 3వేల 989 మినీ అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న 67వేల 411మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తారు.

ఇది కూడా చదవండి : మంచు లక్ష్మికి కరోనా

ఇప్పటికే ఉమెన్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఏటా రెండు చీరలు ఇస్తుంది. అదనంగా నేత చీరలు పంపిణీ చేయాలని అనుకుంటున్నారు.