అమెరికా నుంచి హైదరాబాద్‌కు అమెజాన్‌.. కేటీఆర్‌ విశేష కృషి

  • Published By: sreehari ,Published On : November 7, 2020 / 06:46 AM IST
అమెరికా నుంచి హైదరాబాద్‌కు అమెజాన్‌.. కేటీఆర్‌ విశేష కృషి

Amazon to invest in Hyderabad : ప్రముఖ ఐటీ సంస్థ అమెజాన్‌ అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చేసింది. భాగ్యనగరానికి అమెజాన్ రప్పించడంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేశారు. మంత్రి కేటీఆర్‌ కృషి ఫలితంగానే అమెజాన్‌ సంస్థ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది.



దేశంలోనే అతి పెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌, ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ను గచ్చిబౌలిలో అమెజాన్ నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడిని తెచ్చిపెట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న అమెజాన్‌ పెట్టుబడులను హైదరాబాద్‌ వైపు ఆకర్షించేలా చేయడంలో మంత్రి కేటీఆర్‌ తనదైన ముద్ర వేశారు. అమెజాన్‌ పెట్టుబడి ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పెట్టుబడిదారులు తెలంగాణ వైపు దృష్టిసారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



రాష్ట్రంలో ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్‌ అమెజాన్‌తో భేటీకి సమయం కోరారు. 2014 ఆగస్టులో తొలిసారిగా అమెజాన్ ప్రతినిధులతో అధికారికంగా కేటీఆర్ భేటీ అయ్యారు. అప్పటినుంచి పలుమార్లు అమెజాన్ ప్రతినిధులతో చర్చిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటిపై వివరించారు.



https://10tv.in/amazon-leads-100-billion-cloud-market/
చివరికి అమెజాన్ పెట్టుబడులు పెట్టేలా కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలకు బాటలు పడ్డాయి. దావోస్‌లో ప్రపంచ వాణిజ్య సదస్సుకు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.



పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కంపెనీల సీఈవోలు, నిర్వాహకులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెరిగేలా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగానే కాకుండా కేటీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు.