KTR: పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మాదే – కేటీఆర్

నకిరేకల్ లో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

KTR: పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మాదే – కేటీఆర్

Ktr1

KTR: నకిరేకల్ లో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దీంతో పాటు సీసీ రోడ్, డ్రైనేజ్ విస్తరణ పనులకు శంకుస్థాపన, వైకుంఠ ధామం, రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు వేదిక వద్ద జరిగిన సభలో మంత్రులు కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్ట్‌కైనా జాతీయ హోదా ఇచ్చిందా.. అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ధి నిరోధకాలుగా మారారు. ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి. మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.

ఈనాడు తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ వర్షాకాల సీజన్‌లో కూడా రైతు బంధు సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని సీజన్‌లలో కలిపి 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద అందించాం. ఉమ్మడి నల్గొండ జిల్లా అత్యధిక దిగుబడులు సాధించి గొప్ప పేరును సంపాందించింది.

తెలంగాణకే నల్గొండ జిల్లా దిక్సూచిగా నిలిచింది. FCI సంస్థ లెక్కల్లో దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణగా రికార్డ్‌ను సాధించింది. గతంలో 30 లక్షల ఎకరాల్లో మాత్రమే పండించే వరిని.. ఇప్పుడు రాష్ట్రంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు.

రైతుకు పెట్టుబడి సాయం చేయాలని దేశంలో ఏ నాయకునికి రాని కనీస ఆలోచనను సీఎం కేసీఆర్ అమల్లోకి తీసుకొచ్చారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి. పండించిన ప్రతి గింజను కొంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని అన్నారు మంత్రి కేటీఆర్.