KTR : కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా.. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చాం-కేటీఆర్

తెలంగాణ వచ్చాక పల్లెల్లో, పట్టణాల్లో చక్కని అభివృద్ధి కన్పిస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిపక్ష, పాలక పక్ష ఎమ్మెల్యే అన్న తేడా ఉండదన్నారు కేటీఆర్.

KTR : కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా.. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చాం-కేటీఆర్

Ktr

KTR : సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, జిల్లా ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. రూ.6 కోట్ల 70 లక్షల నిధులతో 3 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నారు. సంగారెడ్డి నియోకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినతిపత్రం ఇచ్చారు.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

గతంలో మున్సిపల్ కార్మికులకు కనీసం వేతనాలు కూడా వచ్చేవి కాదని, నేడు సీఎం కేసీఆర్ సమయానికి వేతనాలు ఇచ్చి వారిని అత్యంత గౌరవంగా చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. అన్ని మున్సిపాలిటీలలో సమీకృత కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా
పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలలో రూ.500 కోట్లతో సమీకృత కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

Jio Prepaid Recharge : వాట్సాప్‌‌‌ ద్వారా జియో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవచ్చు.. ఎప్పటి నుంచంటే..?

తెలంగాణ వచ్చాక పల్లెల్లో, పట్టణాల్లో చక్కని అభివృద్ధి కన్పిస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిపక్ష, పాలక పక్ష ఎమ్మెల్యే అన్న తేడా ఉండదన్నారు కేటీఆర్. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నా రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. కాగా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడినట్లు సంగారెడ్డికి మెట్రో రైలు ఇప్పట్లో సాధ్యం కాదని, భవిష్యత్ లో చూద్దామని కేటీఆర్ అన్నారు.