ఉద్యోగాల భర్తీ లెక్కలివే..తేల్చేసిన మంత్రి కేటీఆర్

ఉద్యోగాల భర్తీ లెక్కలివే..తేల్చేసిన మంత్రి కేటీఆర్

opposition parties

ktr open letter : ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిజాలు దాచాయని, 2014 నుంచి 2020 వరకు ఒక‌ లక్షా 32 వేల 899 ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. లక్షా 32 వేల 899 ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 2021, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏ ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో..ఆయన వివరించారు.

1. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 30,594

2. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ – 31,972

3. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు- 3,623

4. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ – హైదరాబాద్ – 179

5. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ – హైదరాబాద్- 80

6. డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్ – 66

7. జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ – 9,355

8. డిపార్ట్‌మెంట్ అఫ్ ఆయుష్ – 171

9. టీఎస్ జెన్ కో- 856

10. టీఎస్ ఎన్పీడీసీఎల్ – 164

11. టీఎస్ ఎస్పీడీసీఎల్ – 201

12. టీఎస్ ట్రాన్స్ కో – 206

13. టీఎస్-ఆర్‌టీసీ – 4,768

14. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ – 12,500

15. జెన్‌కో, ట్రాన్స్ కో, (NPDCL, NSPDCL) – 6,648

16. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ – 22,637

17. హైదరాబాద్ జలమండలి – 807

18. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ – 243

19. డీసీసీబీలు – 1,571

20. భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు – 6,258

మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899