రామచంద్రారావు ట్వీట్ పై కేటీఆర్ సెటైర్లు..

రామచంద్రారావు ట్వీట్ పై కేటీఆర్ సెటైర్లు..

KTR : బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఓయూ చేరుకున్నా..మీరెక్కడా అంటూ..కేటీఆర్ కు రామచంద్రారావు ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగానే సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెలుసుకొనే పనిలో బిజీగా ఉన్నా…జన్ ధన్ ఖాతాలో మోదీ..రూ. 15 లక్షలు వేశారో లేదో తెలుసుకుంటున్నట్లు సెటైర్ వేశారు. ఎన్డీయే అంటే..నో డేటా అవైలబుల్ అంటూ ఎద్దేవా వేశారు.

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించామన్నారు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే.. తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేసింద‌న్నారు. తెలంగాణ వచ్చాక లక్షా 32 వేల 799 ఉద్యోగాలను ఇచ్చామని.. ఈ విష‌యంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు కేటీఆర్‌ విసిరిన సవాల్‌తో దుమారం రేగింది.

కేటీఆర్‌ సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు. ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్‌ను టార్గెట్‌ చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ సవాల్‌కు ఓకే అంటూ.. గన్‌ పార్క్‌ వద్ద నిరసనకు దిగారు. బీజేపీ 2021, మార్చి 01వ తేదీ సోమవారం ఉస్మానియాలో చర్చకు సిద్ధమైంది.

లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశారంటున్న కేటీఆర్‌.. చెప్పేవి వాస్తవాలే అయితే చర్చకు రావాలంటూ సవాల్‌ విసురుతున్నారు బీజేపీ నేతలు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన ఉస్మానియా యూనివర్సిటీలోనే.. ఉద్యోగాలపై కేటీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు బీజేపీ లీడర్స్. అందులో భాగంగానే…ఎమ్మెల్సీ రామచంద్రరావు అక్కడకు చేరుకున్నారు.