Pharma City అడ్డుకోవడానికి కుట్రలు – కేటీఆర్

  • Published By: madhu ,Published On : September 10, 2020 / 12:13 PM IST
Pharma City అడ్డుకోవడానికి కుట్రలు – కేటీఆర్

Hyd Pharma City KTR : హైదరాబాద్ ఫార్మా సిటీని అడ్డుకోవడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమని సేకరించడం జరిగిందని, ఇక్కడ డీపీఆర్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే..పరిశ్రమలకు భూములు కేటాయించడం జరుగుతోందని శాసనమండలిలో చెప్పారు




మంత్రి కేటీఆర్. 2020, సెప్టెంబర్ 10వ తేదీ గురువారం జరిగిన శాసనసమండలి సమావేశంలో ప్రశ్నోత్తరాల్లో ఈ అంశంపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.




సుమారు 9 వేల ఎకరాల వరకు భూ సేకరణ చేయడం జరిగినట్లు, మరికొంత భూమిని సేకరంచాల్సి ఉందని సభకు తెలిపారాయన. భూమిని సేకరించే విషయంలో స్థానికంగా ఉన్న యువత, లీడర్స్ సహకరంచినట్లు, భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు.

అయితే..ఇక్కడ భూమి కోల్పోయిన వారికి భూమి ఇప్పించే యోచన లేదని స్పష్టంగా చెప్పారు. కేటాయించిన భూములను పరిశ్రమలు వినియోగించుకోకపోతే..వెనక్కి తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
https://10tv.in/god-also-equal-infront-of-highcourt/



ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా ఫార్మా సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం చాలా కాలంగా యోచిస్తోంది. ఈ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫార్మాసిటీ కోసం సేకరిస్తారు.

ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూమిని ఇస్తున్న వారిలో కనీసం కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం ఇచ్చే దిశగా కసరత్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే.




ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోందని, రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు, 5.60 లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు కరోన వ్యాప్తి నేపథ్యంలో ప్రాధాన్యం పెరిగిందన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు లేఖ రాశారు కూడా.

నిమ్జ్ హోదాకు సూత్రప్రాయ అంగీకారం తెలిపిన క్రమంలో కేంద్రాన్ని మంత్రి ఆర్థిక సహాయం కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత ఫార్మా పార్క్ అన్నారు.