Colonel Santhosh Babu: కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం – కేటీఆర్

కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేటలో ప్రతిష్ఠించిన అతని విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్‌-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తూ ఇండియా కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని

Colonel Santhosh Babu: కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం – కేటీఆర్

Ktr

Colonel Santhosh Babu: కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేటలో ప్రతిష్ఠించిన అతని విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్‌-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తూ ఇండియా కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట‌లోని కోర్టు చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నాం రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

అనంతరం వీరుడా.. వందనం అంటూ సెల్యూట్ చేశారు. నీ త్యాగం ఎప్పటికీ మర్చిపోం అంటూ ప్రతిజ్ఞ చేసి ఈ సందర్భంగా కల్నల్ చేసిన సేవలను కొనియాడుతూ కాసేపు ప్రసంగించారు. సంతోష్ బాబు సేవలకు గానూ గతేడాది హాకీంపేట నుంచి సూర్యాపేట వరకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారని అన్నారు. కల్నల్ విగ్రహాన్ని రూపొందించిన జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ బోళ్ల శ్రీనివాస్ రెడ్డిని మంత్రి అభినందించారు.

భారత సైన్యంలో పనిచేసే ప్రతి కుటుంబానికి ప్రజలకు స్ఫూర్తి ఇచ్చేలా సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. కల్నల్ సంతోష్ బాబు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి సంవత్సరం గడిచిందంటే నమ్మలేకపోతున్నాం. చాలా గొప్పగా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యద్భుతమైన విషయం. ఈ పని చేయడం మనందరికీ గర్వకారణంగా ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇచ్చిన గౌరవం, సముచిత స్థానం.. భారత సైన్యం మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చింది. స్ఫూర్తివంతమైన, ఆదర్శప్రాయమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కల్నల్ సంతోష్ బాబు లాంటి గొప్ప వ్యక్తిని కన్న తల్లిదండ్రులు దేవుళ్ళు. మరణం అందరికి వస్తుంది కానీ, సంతోష్ బాబు లాగా సింహం లాగా, సమున్నతంగా ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని వేళలా అండగా వున్నారు. కొండంత భరోసాను ఇచ్చారు. ఈ రోజు సంతోష్ బాబు వర్ధంతి. ఆయన విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.

విగ్రహావిష్కరణలో సంతోష్ బాబు సతీమణి సంతోషి మాట్లాడుతూ..
భారత్ చైనా సరిహద్దుల్లో నా భర్త సంతోష్ బాబు వీర మరణం పొందారు. అనుక్షణం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్ , జగదీష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ అండగా ఉన్నారు. సముచిత గౌరవాన్ని ఇచ్చారు. నా పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. నాకు గౌరవ ప్రదమైన ఉద్యోగం కల్పించారు. ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి అన్ని వేళలా అండగా ఉంటూ ధైర్యం అందించారని పేర్కొన్నారు.