స్టైలిష్ కి‘లేడీ’ : అడ్డంగా కవర్ పెట్టి, పర్సులను కొట్టేస్తున్న మహిళ

స్టైలిష్ కి‘లేడీ’ : అడ్డంగా కవర్ పెట్టి, పర్సులను కొట్టేస్తున్న మహిళ

lady pickpocket kamareddy : బిజీగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తోంది ఆ మహిళ. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాలను ఎంచుకుంటూ..మగవాళ్ల వెనుక జేబులో ఉన్న పర్సులను అమాంతం కొట్టేస్తూ ఉడాయిస్తోంది. ఏ మాత్రం అనుమానం రాకుండా స్టైలిష్‌గా తయారవుతోంది. వరుసగా జరిగిన దొంగతనాల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నాయి.  2020, డిసెంబర్ 23వ తేదీన రెండు దొంగతనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. జీన్స్, టీషర్టు, ముఖానికి మాస్క్ ధరించి ఓ మహిళ ఫస్ట్ మేన్స్ క్లబ్‌లోకి వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి జేబులో ఉన్న పర్సు కొట్టేసింది.

అరగంట వ్యవధిలో సూపర్ మార్కెట్‌కు వచ్చింది. అక్కడ వ్యక్తి జేబు కొట్టేసింది. ఒక్క నిమిషంలోనే జేబులోంచి పర్సు కొట్టేసింది. ఈ సంఘటన ఈ నెల 23వ తేదీన జరిగింది. సీసీ కెమెరాలను పరిశీలించారు. జీన్స్, టీషర్టు ధరించిన మహిళ ముఖానికి మాస్క్ కట్టుకుని ఉంది. షాప్‌‌లోకి ప్రవేశించిన ఆ మహిళ…క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లింది. ఎవరైనా గమనిస్తున్నారా అని చూసి…తన ముందు ఉన్న వ్యక్తి జేబులో నుంచి పర్సును కాజేసింది. ఆయా షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కి ‘లేడీ’ గురించి గాలిస్తున్నారు.