స్వామిగౌడ్ ను కలిసిన లక్ష్మణ్, బండి సంజయ్

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 10:18 PM IST
స్వామిగౌడ్ ను కలిసిన లక్ష్మణ్, బండి సంజయ్

Lakshman and Bandi Sanjay together with Swami Goud : GHMC ఎన్నికల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఉన్న వారిని చేర్చుకొనేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే కొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరెడ్డితో మంతనాలు జరిపారు.



అయితే..2020, నవంబర్ 21వ తేదీ శనివారం సాయంత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తో బీజేపీ నేతలు మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ‌లు సమావేశమయ్యారు. స్నేహపూర్వక భేటీ అని స్వామిగౌడ్ అన్నారు.



టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు రోడ్డు మీద పడ్డారని, స్వామిగౌడ్ హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తి అన్నారు. స్వయం సేవక్ గా కూడా పని చేశారని, స్నేహపూర్వకంగా స్వామి గౌడ్ ను కలిసినట్లు తెలిపారు. భవిష్యత్ లో ఆయన బీజేపీలో కి వస్తున్నట్లు ఆశిస్తున్నట్లు చెప్పారు.