Land grabs in Medak : భూ దందా ఆరోపణలు కట్టుకథలు – ఈటల

ముందస్తు ప్రణాళిక బద్ధంగా..తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

Land grabs in Medak : భూ దందా ఆరోపణలు కట్టుకథలు – ఈటల

Land Grabs In Medak Minister Etela Rajender Press Meet

Etela Rajender : ముందస్తు ప్రణాళిక బద్ధంగా..తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆయనపై వస్తున్న భూ ఆక్రమణలపై ఆయన వివరణ ఇచ్చాారు. అసైన్డ్ భూములను కబ్జా చేశారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు ప్రశారం చేశారని, అంతిమ విజయం ధర్మానిదేనన్నారు. చిల్లరమల్లర కథనాలు ప్రజలు నమ్మరన్నారు. 2021, ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

జమున హ్యాచరీస్ కోసం రూ. లక్షల చొప్పున 40 ఎకరాలు కొనడం జరిగిందన్నారు. కెనరా బ్యాంకు కోసం రూ. 100 కోట్లు తీసుకున్నట్లు, కొంత విస్తరించేందుకు మరో ఏడు ఎకరాల భూమిని కొన్నట్లు తెలిపారు. ఇంకా కడుతున్నట్లు, పౌల్ట్రీకి స్థలం కావాల్సి ఉంటుందన్నారు. మరింత పెంచాలని భావిస్తే..చుట్టుపక్కల అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు.

ఇండస్ట్రీ డిపార్ట్ మెంట్ కు తాను ఓ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అసైన్డ్ భూములున్నాయి..దీనిని విస్తరించేందుకే ఏదైనా మార్గం ఉందా అని సీఎంఓ ఆఫీసు నర్సంగరావును అడిగినట్లు చెప్పారు. రాళ్లు, రప్పలకు చెందిన భూమి అని, వ్యవసాయ భూమి కాదన్నారు. 1994 ఇస్తే..ఇంతవరకు ఒక్క ఎకరం సాగు చేయలేదని చెప్పడం జరిగిందన్నారు.

వాళ్లు సమ్మతిస్తే..అప్పుడు జీఎస్ఐఎఐసీ ద్వారా అలౌట్ చేసే అవకాశం ఉందని చెప్పారన్నారు. దాదాపు 20 నుంచి 25 ఎకరాల భూమిని ఎమ్మార్వోకు అప్పచెప్పామన్నారు. ఇప్పటికీ ఒక్క ఎకరం భూమి సాగు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. ఏ భూములు అసైన్డ్ చేశామో..అక్కడే ఉన్నాయన్నారు. భూములు ఆక్రమించుకున్నారనే వస్తున్న కథనాలు నిరాధారమైనవన్నారు. తన దగ్గరకు వస్తే..అమ్ముకోరాదు..కొనరాదు..అని తాను చెప్పడం జరిగిందన్నారు. రైతుల దగ్గర తాను భూములు తీసుకోలేదని, రైతులే స్వచ్చదంగా ప్రభుత్వానికి భూములు సరెండర్ చేశారన్నారు మంత్రి ఈటల రాజేందర్.

Read More : Etela Rajender : ఈటలపై భూ దందా ఆరోపణలు..సీఎం కేసీఆర్ సీరియస్