Telangana Land Value : తెలంగాణలో పెరిగిన భూముల విలువ.. ఈ నెల 22 నుంచి అమల్లోకి.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు!

తెలంగాణలో భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

Telangana Land Value : తెలంగాణలో పెరిగిన భూముల విలువ.. ఈ నెల 22 నుంచి అమల్లోకి.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు!

Land Value Increased In Telangana State, Land Registration Charges Hiked

Telangana Land Values Hike : తెలంగాణలో భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఒక్కోచోట ఒక్కో ధరను ప్రభుత్వం నిర్ణయించనుంది. ప్లేస్, ప్లాట్, మార్కెట్ ఆధారంగా కొత్త రేట్లు నిర్ణయం తీసుకోనుంది. గ్రామీణ, పట్టణ, కమర్షియల్ గా భూముల విభజన జరుగనుంది. శ్లాబుల వారీగా మార్కెట్ విలువలు ఫిక్స్ చేయనుంది. కనిష్టంగా 20శాతం, గరిష్టంగా 50శాతం పెరిగాయి.

వ్యవసాయేతర భూములు, ఇళ్ల విలువ 50శాతానికి పెరిగాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ, ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లకు కొత్త విలువలను నిర్ణయించింది ప్రభుత్వం. సవరించిన విలువలను సబ్‌ రిజిస్టార్లకు పంపి.. పూర్తిగా పరిశీలించి తర్వాతే ఖరారు చేసింది. భూముల మార్కెట్ విలువల పెంపులో మార్పులు చేసింది. 6 నుంచి 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. వ్యవసాయ భూముల విలువ 30 నుంచి 50 శాతం పెంచింది.

వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరానికి రూ.75వేలు నిర్ణయించింది. ఓపెన్ ప్లాట్ కనిష్ట విలువ చదరుపు గజానికి రూ.200లు పెంచింది. అపార్ట్ మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.వెయ్యి పెంచింది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపుపై ఇటీవలే కేబినెట్‌ సమావేశంలో చర్చించింది.

భూముల విలువతో పాటు పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా రిజిస్టార్లందరూ మార్కెట్‌ విలువల అసలు రిజిష్టర్‌లను హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ కార్యాలయంలో అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.