HCU : విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలి-హెచ్‌సీయూ వీసీ
హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులను కోరారు. క్లాసులు, పరీక్షలు అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

HCU : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బీజే రావు విద్యార్థులకు కీలక విజ్ఞప్తి చేశారు. హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులను కోరారు. క్లాసులు, పరీక్షలు అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కొవిడ్ బాధితులని ఐసోలేట్ చేసేందుకు వర్సిటీలో వసతులు చాలా పరిమితంగా ఉన్నాయని వీసీ తెలిపారు.
Corona Side Effect: కరోనా నుంచి కోలుకున్నాక ఎదురయ్యే సమస్యలు ఇవే..!
మరోవైపు కేసులు పెరుగుతున్నందున యూనివర్సిటీ డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థులు, సిబ్బంది యూనివర్సిటీ ఫార్మసీలో అందుబాటులో ఉన్న కిట్ల ద్వారా లేదా బయట కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కొవిడ్ పరిస్థితులను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు క్యాంపస్ విడిచి స్వస్థలాలకు వెళ్లిపోవడమే మంచిదని వీసీ అభిప్రాయపడ్డారు. అన్ని పరీక్షలు గతంలో మాదిరిగా ఆన్‌లైన్‌లో జరపాలని యూనివర్సిటీ టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసిందని వీసీ వెల్లడించారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 20వేల 243 కరోనా టెస్టులు చేయగా.. కొత్తగా 4వేల 416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 4,069కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి 1,920 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29వేల 127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1670 కేసులు నమోదయ్యాయి.
AP Govt Employees Strike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సైరన్
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,26,819కి చేరింది. ఇందులో 6,93,623 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలు రేటు 0.56శాతం, రికవరీ రేటు 95.43శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1670, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 417, రంగారెడ్డిలో 301, హనుమకొండలో 178, ఖమ్మంలో 117 కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటితో (4,207) పోలిస్తే ఇవాళ 209 కేసులు అధికంగా వచ్చాయి. రోజురోజుకి కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
- CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
- Telangana : రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది..అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించాలి
- TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?
- Telangana : ‘రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు, బ్లాక్ మెయిలర్..నన్నుబెదిరించాడు..అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్..’: మంత్రి మల్లారెడ్డి
- Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు
1Road Accident: పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి
2Cancer Injection : క్యాన్సర్ ను ఖతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగించిన పరిశోధకులు
3SBI JOBS : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ
4Botsa Satyanarayana: మా నాయకుల ఇండ్లు మేమే తగులబెట్టుకుంటామా: బొత్స
5Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
6Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు
7Maharashtra : ‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’.. మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు
8Chandrababu Naidu: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు
9JNAFAU : హైదరాబాద్ జేఎన్ఏఎఫ్ఏయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు
10CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
-
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?