Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు

మే 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. బుధవారం హైదరాబాద్ లో వామపక్ష నేతలు నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు.

Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు

Protest

Political Protests: దేశంలో ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈక్రమంలో తెలంగాణలో ధరల నియంత్రణ నిమిత్తం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వామపక్ష పార్టీలు సిద్ధం అయ్యాయి. ఆమేరకు మే 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. బుధవారం హైదరాబాద్ లో వామపక్ష నేతలు నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో పాటు, భూముల రిజిస్ట్రేషన్‌, విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించే వరకు ఆరు రోజుల పాటు నిరనసలు చేయాలనీ వామపక్షాలు నిర్ణయించాయి.

Other Stories:Bangalore Rains: బెంగళూరును ముంచెత్తిన వాన.. ఇద్దరు మృతి

మే 25 నుండి 31 వరకు మూడు విడతలుగా ఆందోళనా పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మే 27న మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శన, ధర్నాలు చేయనున్నారు. మే 30న జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు, చేయనున్నారు. మే 31న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పది వామపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. మరోవైపు మోటార్ వెహికల్ యాక్ట్ 2019పై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ బుధవారం అర్ధ రాత్రి నుంచి హైదరాబాద్ లో ఆటో, క్యాబ్, లారీ వాహనాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నారు.