రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం 

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం 

Leopard Wandering Around Rajendranagar Agriculture University 3011

మూడు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారిస్తోంది. ఫారెస్టు అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది.
వెంటనే అలర్జ్ అయిన అధికారులు… రాత్రి సమయంలో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

చిరుతను పట్టుకునేంత వరకు కంటిమీద కునుకు లేకుండా నిత్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తుందోనని గజ గజ విణికిపోతున్నారు స్థానికులు. చిరుత పట్టుకోండి చూద్దామంటూ అధికారులకు సవాల్ విసురుతోంది. చిరుతపులి 15 రోజులుగా ఇక్కడిక్కడే తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారులు చిరుత వేట కొనసాగిస్తున్నారు.

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు
ట్రాప్ కెమెరాల్లో కనిపించడంతో దాన్ని పట్టుకునేందుకు శతవిదాల ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయంలో కూడా చిరుత ఆపరేషన్  కొనసాగుతోంది. రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో 20 నైట్ విజన్ కెమెరాలు, మరో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. చిరుత ఆనవాళ్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.