నల్గొండ జిల్లాలో ఫారెస్టు అధికారులపై చిరుత దాడి

  • Published By: srihari ,Published On : May 28, 2020 / 07:12 AM IST
నల్గొండ జిల్లాలో ఫారెస్టు అధికారులపై చిరుత దాడి

నల్గొండ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. మర్రిగూడెం మండలం రాజంపేట తండాలోని ఓ రైతు పొలంలో చిరుతపులి ప్రత్యక్షం అయింది.  రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కింది. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతులకు అరుపులతో వినిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఫారెస్టు అధికారులు గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత ఎట్టకేలకు చిరుతను ఫారెస్టు అధికారులు బంధించారు. చిరుత సంచారంతో స్థానికులు బిక్కుమంటున్నారు. 

గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది. మర్రిగూడెం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని చాలా కాలంగా చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. నాలుగు నెలల క్రితం మర్రిగూడెం మండలం అజలాపురంలో ఓ సారి చిరుత చిక్కుంది. ఆ సందర్భంలో కూడా మరికొన్ని చిరుతల కదలికలు తమకు ఉన్నాయని రైతులు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. 

అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది. దీంతో ఉచ్చు వేసిన రైతుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ సందర్భంలో కూడా అధికారులపై చాలా విమర్శలు వచ్చాయి. అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు రైతులు చేను చుట్టూ కంచే వేశారు.

చిన్న సందులో చిరుత చిక్కుకు పోయింది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టాలి. ఇంకొక చిరుత ఉందని చెబుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే దీనిపై అందరం ఉద్యమిస్తామని రైతులు చెబుతున్నారు. 

Read: Breaking News : తెలంగాణలోకి మిడతల దండు!