లాక్ డౌన్ ఎఫెక్ట్ : హైదరాబాద్ లో మూతపడ్డ ప్రైవేట్ హాస్టల్స్

  • Published By: srihari ,Published On : May 24, 2020 / 11:56 AM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్ : హైదరాబాద్ లో మూతపడ్డ ప్రైవేట్ హాస్టల్స్

హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహకులపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా 60 రోజులపాటు ప్రైవేట్ హాస్టల్స్ నడవకపోవడంతో అప్పుల ఊబిలో పడిపోయామని నిర్వహకులు అంటున్నారు. ఆపద సమయంలో అండగా ఉండాల్సిన హాస్టల్ బిల్డింగ్ యజమానులు అద్దె చెల్లించాలని తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చేస్తున్నారు. దీంతో చేసేది ఏమీలేక న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. 

కరోనా లాక్ డౌన్ ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహకులను రోడ్డుపై పడేసింది. 60 రోజులుగా విద్యార్థులు లేకపోవడంతో తమకు భారంగా మారిందంటున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలకు కొన్ని సడలింపులు ఇచ్చాయి. ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చాయి కనుక తమను ఆదుకోవాలంటూ మోహిదీపట్నంలో వినూత్నంగా మౌన దీక్ష చేస్తున్నారు. 

హైదరాబాద్ లో ఐదు వేలకు పైగా హాస్టల్స్ ఉంటాయి. సుమారు 50 వేలకు పైగా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. 5 లక్షలకు పైగా విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చి ఉపాధి పొందే వారు, స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే వారు ప్రస్తుతం హాస్టల్స్ లో ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.

గతంలో ప్రభుత్వం చెప్పినట్లుగా లాక్ డౌన్ కారణంగా ఎవరు కూడా వారి ప్రాంతాలు వెళ్లకుండా, ఊర్లకు వెళ్లకుండా హాస్టల్స్ నిర్వహకులు చూసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో పరిస్థితి మారిపోవడం, లాక్ డౌన్ కొనసాగుతుండటంతో తమకు ఆర్థిక భారంగా మారిందని వాపోతున్నారు. అద్దెలతోపాటు ఎవరు కూడా వసూలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వేధింపులు గురి చేస్తున్నారని.. తమకు కూడా కొంత వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.