TG Lockdown : కూకట్‌పల్లిలో ఫుల్ ట్రాఫిక్..కరోనాకు వెల్ కం చెబుతున్న జనాలు

ఎలాంటి కారణం లేకుండా..రోడ్ల మీదకు వస్తే..చర్యలు తీసుకుంటామని పోలీసులు, ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అయితే..కొంతమంది జనాలు డోంట్ కేర్ అంటున్నారు. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.

TG Lockdown : కూకట్‌పల్లిలో ఫుల్ ట్రాఫిక్..కరోనాకు వెల్ కం చెబుతున్న జనాలు

Kukatpally

Full Traffic In Kukatpally : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా కంట్రోల్ లోకి వస్తోంది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేసులు మరింత తక్కువ కావడానికి ప్రభుత్వం ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 06 గంటల వరకు లాక్ డౌన్ విధించింది.

ఏదైనా పనులు ఉంటే..10 లోపున చేసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని..ఎలాంటి కారణం లేకుండా..రోడ్ల మీదకు వస్తే..చర్యలు తీసుకుంటామని పోలీసులు, ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అయితే..కొంతమంది జనాలు డోంట్ కేర్ అంటున్నారు. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అవుతోంది.

లాక్ డౌన్ విధించని సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఉంటుందో అలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి. 2021, మే 19వ తేదీ బుధవారం ఉదయం కూకట్ పల్లిలో వాహనాలు తీసుకుని రోడ్ల మీదకు వచ్చేశారు. దీంతో ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు, పోలీసులు శ్రమించాల్సి వచ్చిందంటే..ఎలాంటి ట్రాఫిక్ జాం ఉందో అర్థం చేసుకోవచ్చు.

కూకట్ పల్లి చౌరస్తాలో కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 10 దాటినా..ప్రజలు రోడ్ల మీదకు రావడంతో మరలా కరోనా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసిపోయింది.

ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతుండడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగించాలని భావించింది. ఈనెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తూ..ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.