Telangana : లాక్ డౌన్ దిశగా తెలంగాణ ?

ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆలోపే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 2021, మే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana : లాక్ డౌన్ దిశగా తెలంగాణ ?

Telangana

Lockdown : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమా ? దీనివల్ల కేసులు తగ్గుముఖం పడుతాయా ? అనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫస్ట్ వేవ్ లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే..కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విస్తరిస్తున్నా..లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకకపోతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే..లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకొనేందుకు రెడీ అవుతోంది సీఎం కేసీఆర్ సర్కార్. 2021, మే 11వ తేదీ మంగళవారం కేబినెట్ సమావేశం జరుగనుంది. లాక్ డౌన్ విధిస్తే..ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

లాక్ డౌన్ విధించినా..ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆలోపే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 2021, మే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీనిపై సీఎంవో కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. వరుస ట్వీట్స్ చేసింది.
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనున్నది. రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది.

ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశంపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది.


మరి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.

Read More : కరోనా ప్రపంచంలో తగ్గితే.. దేశంలో పెరిగింది.. 14శాతం పెరిగిన మరణాలు