Lockdown : హైదరాబాద్‌లో రోడ్లపై జనాలు..స్పాట్‌లో వాహనాలు సీజ్

ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

Lockdown : హైదరాబాద్‌లో రోడ్లపై జనాలు..స్పాట్‌లో వాహనాలు సీజ్

Hyd Lock Down

Lockdown Rules Full Strict : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. పకడ్బందిగా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 06గంటల వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే..నాలుగు గంటల సమయంలో రోడ్లపైకి భారీగా ప్రజలు వస్తున్నారు.

ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి కారణం లేకుండా బయటకు వచ్చిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్పాట్ లోనే వాహనాలు సీజ్ చేస్తున్నారు.

ఇకపై అనవసరంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ఆదేశాలు రావడంతో.. రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేందుకు రెడీ అయ్యారు పోలీసులు. ఉదయం 10 గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చే వాహనాలను సీజ్‌ చేయాలని డీజీపీ ఆదేశించారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని.. పోలీస్‌ కమిషనర్‌, ఎస్పీ,డీఎస్పీ, డీసీపీ, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులంతా కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని చెప్పారాయన.

మార్కెట్లు, దుకాణాల దగ్గర పెద్దఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తోందని.. దీనిని నివారించేందుకు ఉదయం 6 గంట‌ల‌ నుంచే తమ అవసరాల కోసం వెళ్లేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.

Read More : Galapagos Darwin Arch : ప్రసిద్ధ రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కూలిపోయింది!