Jogulamba: తవ్వకాల్లో బయటపడ్డ లాకర్.. తెరిచిచూస్తే షాక్

పల్లె ప్రగతిలో భాగంగా జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ లాకర్ స్థానికుల్లో ఉత్కంఠ రేకెత్తించింది. వందల ఏళ్ల క్రితం నాటి పురాతన లాకర్ కావడంతో విలువైన ఆభరణాలు, వస్తువులు ఉంటాయని భావించారు.

Jogulamba: తవ్వకాల్లో బయటపడ్డ లాకర్.. తెరిచిచూస్తే షాక్

Jogulamba

Jogulamba: పల్లె ప్రగతిలో భాగంగా జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ లాకర్ స్థానికుల్లో ఉత్కంఠ రేకెత్తించింది. వందల ఏళ్ల క్రితం నాటి పురాతన లాకర్ కావడంతో విలువైన ఆభరణాలు, వస్తువులు ఉంటాయని భావించారు. ఈ ఘటన ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లోని ధరూర్ మండలం భీంపురం గ్రామంలో చోటు చేసుకుంది.

లాకర్ కనిపించడంతో గ్రామస్తులంతా అందులో బంగారం, వెండి లాంటివి ఉంటాయని భావించి రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి లాకర్‌ను భద్రపరిచారు. పట్టించుకోకుండా వదిలేసిన ఇంట్లో కనిపించిన బీరువాలోని లాకర్ పై ఉత్కంఠ పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించేందుకు వచ్చారు.

గ్రామంలో ఉన్న బీసీ కమ్యూనిటీ హాల్ లో భద్ర పరిచిన లాకర్‌ను మండల రెవెన్యూ అధికారి హరికృష్ణ, ధరూర్ ఎస్సై రాములు పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ , రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో వెల్డింగ్ కట్టర్ సహాయంతో నాలుగు గంటల పాటు కష్టపడి ఓపెన్ చేశారు.

ఇందులో పురాతన కాలం సంబంధించిన గుడ్డలో అప్పటి దస్తావేజులు లభ్యమైయ్యాయి. ఆసక్తి పెంచుకున్న గ్రామస్తులకు నిరాశే మిగిలింది. ఇంటికి సంబంధించిన వారసులు మీడియాతో మాట్లాడుతూ గతంలో మా పూర్వీకులు ఆ లాకర్ లో తమ వ్యాపార వ్యవహారాల కోసం సంబంధించిన పత్రాలను భద్రపరుస్తూ ఉండేవారని తల్లిదండ్రులు చెప్పారని అన్నారు.