KTR Twitter : బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా.. వీడియో వైరల్

తాజాగా..ఓ వీడియోను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

KTR Twitter : బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ ఫిదా.. వీడియో వైరల్

Ktr Tweet

Loved This Video From Jagtial : కరోనా జీవితాలను అతాలకుతలం చేసేసింది. పనులు లేక..కుటుంబాన్ని పోషించలేక..సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. చేతిల్లో డబ్బులు లేకపోవడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదు కొంతమందికి. దీంతో ఇంట్లో ఉన్న వారు సైతం చిన్న చిన్న పనులు చేసేందుకు వెళుతున్నారు. కనీసం కుటుంబాన్ని నెట్టుకొద్దామనే ఆలోచనతో ఇంతవరకు ఇంట్లో ఉన్న మహిళలు సైతం గడపదాటుతున్నారు. ఇందులో చదువు కోవాల్సిన పిల్లలు కూడా మేము కూడా పని చేస్తామని వెళుతున్నారు. చిన్నతనంలోనే వారి మీద పెద్ద బాధ్యతలు పడుతున్నాయి. ఇంట్లోని ప్రతొక్కరూ ఏదో ఒక పని చేస్తే తప్ప…పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు కొంతమంది. కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని…చదువుకుంటూనే పని చేస్తున్న చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. తాజాగా…తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ అందర్నీ ఆకట్టుకొంటోంది. చాలా మందికి నచ్చడంతో ఈ ట్వీట్ తెగ వైరల్ గా మారింది.

Read More : International sign day : ప్రపంచ సంజ్ఞ దినోత్సవం..వారికోసమే ఈ రోజు

అసలు ట్వీట్ లో ఏముంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారనే సంగతి తెలిసిందే. తమకు సమస్యలున్నాయని..ఆదుకోవాలని ప్రజలు కోరితే..వెంటనే ఆయన రెస్పాండ్ అవుతుంటారు. చాలా మందికి సహాయం చేశారు కూడా. అదే విధంగా..సమాజానికి ఉపయోగపడే..ఆలోచింప చేసే వీడియోలు, వార్తలు, ఫొటోలు..ఇతరత్రా షేర్ చేస్తుంటారు. తాజాగా..ఓ వీడియోను మంత్రి షేర్ చేశారు. బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్లు…అతని ఆత్మవిశ్వాసం..ఆలోచనల్లో…స్పష్టత…హావభావాలు తనకు చాలా నచ్చాయంటూ..క్యాప్షన్ జత చేశారు.

Read More : UK : కరోనా టీకా ధృవపత్రంపై ఇండియా – బ్రిటన్ వార్

బుడ్డోడు ఎవరు ? ఏం చేశాడు ?

జగిత్యాల జిల్లాలో స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో జై ప్రకాశ్ చదువుకుంటున్నాడు. ఓ రోజు ఉదయం ఇతను పేపర్ వేస్తూ..ఓ వ్యక్తికి కనిపించాడు. వెంటనే అతడిని ఆపి…ఏం చేస్తున్నావు అంటూ..ప్రశ్నించాడు. ఈ ఏజ్ లో పేపర్ ఎందుకు వేస్తున్నావు అడిగాడు. వెంటనే జై ప్రకాశ్..ఏ మాత్రం బెదరకుండా…పేపర్ వేయొద్దా ? అని ఎదురు ప్రశ్నించాడు. చదువుకొనే ఏజ్ లో పని చేస్తున్నావు కదా..అందుకే అలా అడిగా..అంటూ ఆ వ్యక్తి ప్రశంసిస్తూ చెప్పాడు. చదువుకుంటూనే పన చేస్తున్నా…అందులో తప్పేముంది ? అంటూ వెల్లడించారు. ఈ ఏజ్ లో ఇలా కష్టపడడం చాలా నచ్చింది అంటూ చెప్పగానే..కష్టపడితే..భవిష్యత్ లో నాకు మేలు చేస్తుందని ఠక్కున చెప్పాడు జై ప్రకాశ్..వీడియోలో ఈ బుడ్డోడి రియాక్షన్..హావభావాలు చూసిన ప్రతొక్కరూ ఫిదా అవుతున్నారు.