యాక్టర్ కాదు..సబ్ ఇన్‌స్పెక్టర్ : లాక్‌డౌన్ వేళ కార్లపై స్టంట్

10TV Telugu News

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. అయితే..విధుల్లో ఉన్న పోలీస్ ఎలా వ్యవహరించాలి ? ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి కదా. కానీ ఓ సబ్ ఇన్స్ పెక్టర్ సినిమాల్లో హీరోగా స్టంట్ చేశాడు. ఫలితంగా..ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. 

అసలు ఏం చేశారు ? 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలో మనోజ్ యాదవ్ సబ్ ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇతను చేసిన నిర్వాకానికి ఉన్నతాధికారులు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే..ఓ రెండు కార్లపై అటో..ఇటో కాలు వేసి దర్జగా నిలబడ్డాడు. కార్లు పోతున్నా..హీరోలా నిలబడ్డాడు. 

బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ ఫిలిం సింగం..సినిమాలోని ఓ పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా.. మనోజ్ యాదవ్ ఈ స్టంట్ చేశాడు. చేస్తే ఏముంది..అని అనకండి…ఖాకీ డ్రెస్ లోనే ఇదంతా చేశాడు. ఇంకేమంది..క్షణాల్లో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారులు రెస్పాండ్ అయ్యారు. ఎస్పీ ఆఫీసులో వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఐజీ సాగర్ అనీల్ శర్మ ఆదేశించారు. దీనికి సంబంధించి..షోకాజ్ నోటీసు జారీ చేశారు. 

 

Read Here>>  9నెలల నిండు గర్భిణీతో ఉన్నా..సేవలు మానని నర్సుకు హ్యాట్సాఫ్