Manda Krishna Madiga : జులై 2న సడక్ బంద్, జాతీయ రహదారుల దిగ్బంధం-మందకృష్ణ మాదిగ

Manda Krishna Madiga : జులై 2న సడక్ బంద్, జాతీయ రహదారుల దిగ్బంధం-మందకృష్ణ మాదిగ

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. జాతీయ సమావేశాలకి ముందే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

Manda Krishna Madiga : జులై 2న సడక్ బంద్, జాతీయ రహదారుల దిగ్బంధం-మందకృష్ణ మాదిగ

Manda Krishna Madiga : మాదిగ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే జులై 2,3 తేదీల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. జులై 2న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సడక్ బంద్, జాతీయ రహదారుల దిగ్బంధం నిర్వహిస్తామన్నారు. 3వ తేదీన ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. జాతీయ సమావేశాలకి ముందే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే మాదిగల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు మందకృష్ణ మాదిగ.

Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం

షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో ఉన్న అన్ని కులాలకు అందాల్సిన రిజర్వేషన్‌ ఫలాలను కొన్ని కులాలు ఏకపక్షంగా దోచుకుంటున్నాయని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ.. దారుణంగా మోసం చేసిందన్నారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మాదిగ ప్రజలంతా పెద్దఎత్తున సడక్‌ బంద్‌ చేపట్టాలని సూచించారు.

×