Yadadri Temple : మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం.. గోపురం బంగారు తాపడానికి సీఎం కేసీఆర్ తొలి విరాళం

యాదాద్రి ఆలయం పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి28న మహా కుంభ సంప్రోక్షణం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సంప్రోక్షణంకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందన్నారు.

Yadadri Temple : మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం.. గోపురం బంగారు తాపడానికి సీఎం కేసీఆర్ తొలి విరాళం

Cm Kcr

Maha Kumbha samprokshanam : యాదాద్రి ఆలయం పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. మార్చి 28, 2022న మహా కుంభ సంప్రోక్షణం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సంప్రోక్షణంకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందని చెప్పారు. 1008 కుండలాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అన్ని పీఠాధిపతులను ఆహ్వానిస్తామని చెప్పారు. దివ్యసాకేతంలో చిన్నజీయర్ స్వామి గొప్ప కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. భగవత్ రామానుజ స్వామి విగ్రహ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు.

స్వామి వారి గోపురానికి స్వర్ణ తాపడం చేయిస్తామని చెప్పారు. 125 కిలోలతో స్వర్ణ తాపడం జరుగుతుందన్నారు. యాదాద్రికి ఆలయ గోపుర బంగారు తాపడానికి సీఎం కేసీఆర్ తొలి విరాళం ప్రకటించారు. గోపురం బంగారు తాపడం కోసం తమ కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం ఇస్తామని స్పష్టం చేశారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమం తరపున కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.

CM KCR : యాదాద్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. 125 కేజీల బంగారంతో తాపడం

బంగారం విరాళం ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరపున ఒక కిలో బంగారం ఇస్తున్నారని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గం తరపున మరో కిలో బంగారం విరాళంగా ఇస్తున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి 2 కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నారని తెలిపారు. కావేరీ సీడ్స్ భాస్కర్ రావు కిలో బంగారం ఇస్తానన్నారని పేర్కొన్నారు.

చాలా మంది ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు బంగారం విరాళం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. గోపురం బంగారు తాపడానికి 125 కేజీలు అవసరం అన్నారు. బంగారు తాపడానికి స్వచ్ఛమైన బంగారం కావాలన్నారు. బంగారాన్ని ఆర్బీఐ నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు.