Mahaboob Nagar Old Man: తాత పిట్టగూడు మాస్క్.. అధికారులు షాక్!

కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే మన ముందున్న ఆయుధాలు మూడే. ఒకటి మాస్క్.. రెండు శానిటైజర్.. మూడు సామజిక దూరం. అందుకే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటకి రావద్దని మరీ మరీ చెప్తున్నాయి.

Mahaboob Nagar Old Man: తాత పిట్టగూడు మాస్క్.. అధికారులు షాక్!

Mahaboob Nagar Old Man

Mahaboob Nagar Old Man: కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే మన ముందున్న ఆయుధాలు మూడే. ఒకటి మాస్క్.. రెండు శానిటైజర్.. మూడు సామజిక దూరం. అందుకే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటకి రావద్దని మరీ మరీ చెప్తున్నాయి. కానీ కొందరు దీన్ని పెడచెవిన పెట్టి వాళ్ళు మహమ్మారికి చిక్కడమే కాకుండా మరికొందరికి దాన్ని అంటిస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో పెద్దగా అవగాహనా లేకపోవడంతో కేవలం మాస్క్ ధరించకపోవడం వలనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. అయితే.. ఓ తాత వెరైటీ మాస్క్ ధరించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు.

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఓ తాత పిట్టగూడును మాస్క్ లా గా ధరించి అంద‌రి దృష్టిలోప‌డ్డాడు. చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన తాత పొలంలో పనిచేసుకుంటుండగా పింఛన్ ఇస్తున్నారని చెప్పడంతో అడ్డాకులకు వచ్చాడు. అయితే.. పొలం నుండి వస్తూ వస్తూ పిట్టగూడును ఒకదాన్ని మాస్క్ లాగా ధరించి పెన్షన్ ఇచ్చే అధికారి వద్దకు వచ్చాడు. తాత పిట్టగూడు మాస్క్ చూసిన ఆ అధికారి ముందు షాక్ తిన్నాడు.

అయితే.. కుర్రాళ్లే ఏముందిలే అని లైట్ తీసుకుంటున్న ఈ రోజుల్లో తాత తీసుకుంటున్న జాగ్రత్తలు చూసిన ఆ అధికారి ఫిదా అయిపోయి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే తాత పిట్టగూడు మాస్క్ ఇప్పుడు ఫుల్ వైరల్ అయిపొయింది. అయితే.. ఒక మాస్క్ ధరించినా వైరస్ నుండి రక్షణ కష్టమేనని చెప్తున్న ఈ సమయంలో ఈ పిట్టగూడు మాస్క్ ఎంతవరకు ఆపుతుందన్నది మనం చెప్పేలేని అంశం కాగా మాస్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న పిట్టగూడును మాస్క్ లా పెట్టుకొని తన జాగ్రత్తను చాటిన తాతకి మాత్రం అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.