Mahabubabad: సర్పంచ్ భర్త లైంగిక వేధింపులు..చితక్కొట్టిన మహిళలు

మహిళలపై సర్పంచ్ భర్త వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబా బాద్ జిల్లా అవుతాపురం సర్పంచ్ భర్త గ్రామంలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బైటపడింది. దీంతో గ్రామస్తులు సర్పంచ్ భర్తపై దాడి చేశారు. అవుతాపురం సర్పంచ్ భర్త సుధాకర్ గ్రామంలోని పలువురు మహిళలకు ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని వేధిస్తున్నట్లుగా ఓ ఆడియో వైరల్ గా మారింది

Mahabubabad: సర్పంచ్ భర్త లైంగిక వేధింపులు..చితక్కొట్టిన మహిళలు

Sarpanch Husband Sexual Harassment

Sarpanch husband sexual harassment : మహిళలపై సర్పంచ్ భర్త వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబా బాద్ జిల్లా అవుతాపురం సర్పంచ్ భర్త గ్రామంలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బైటపడింది. దీంతో గ్రామస్తులు సర్పంచ్ భర్తపై దాడి చేశారు. అవుతాపురం సర్పంచ్ భర్త సుధాకర్ గ్రామంలోని పలువురు మహిళలకు ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని వేధిస్తున్నట్లుగా ఓ ఆడియో వైరల్ గా మారింది.

ఓ మహిళలకు మధ్యవర్తిగా పెట్టుకుని గ్రామంలోని పలువురు మహిళను టార్గెట్ గా చేసుకుని వారికి ఫోన్లు చేసి వేధింపులకు పాల్పడుతున్న ఆడియో బైటపడటంతో అవుతాపురం గ్రామస్తులు భగ్గుమన్నారు. వేధింపుల బాధిత మహిళలు అందరూ కలిసి ఈ విషయాన్ని వారి భర్తలకు..మరికొంతమందికి చెప్పారు.అనంతరం వారంతా పంచాయితీ కార్యాలయం వద్దకు చేరి..సర్పంచ్ మంజుల భర్త సుధాకర్ ను పంచాయితీ కార్యాలయంలోనే చితకబాదారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరస్థితిని అదుపులోకి తెచ్చారు. అదే విషయాన్ని సుధాకర్ ను పోలీసులు నిలదీయగా..నాకేంద తెలీదంటూ అబద్దాలు ఆడటానికియ యత్నించారు. వాళ్లు నామీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎదురు మహిళలకు పోలీసులు సమక్షంలోనే తిట్టాడు. దీంతో పోలీసులు కూడా అతడిని మందలించారు.