చిన్నారి దీక్షిత్ మర్డర్ కేసు : మందసాగర్ కు సహకరించిన ఆ నలుగురు ఎవరు

  • Published By: madhu ,Published On : October 23, 2020 / 11:28 AM IST
చిన్నారి దీక్షిత్ మర్డర్ కేసు : మందసాగర్ కు సహకరించిన ఆ నలుగురు ఎవరు

Mahabubabad Dixit Murder : మహబూబాబాద్‌లో దీక్షిత్ కిడ్నాప్‌.. ఆపై హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి. కీలక నిందితుడు మంద సాగర్‌కు సహకరించిన నలుగురిని గుర్తించారు. నలుగురి పాత్రపై ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.



కీలక నిందితుడు సాగర్ కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే కిడ్నాపర్ వాడిన యాప్ ఓటీపీ దుర్వినియోగంపై కూపీ లాగుతున్నారు. కిడ్నాపర్ ఫోన్‌ నెంబర్‌ అతని మిత్రులు వాడిన ఫోన్‌ నెంబర్‌ కాల్‌ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.

సాగర్ ట్రైన్‌ ప్రయాణం చేస్తుండగా అతని ఫ్రెండ్‌ ఇంటర్నెట్ కాల్ చేసి ఆటపట్టించాడట. ఆ సంఘటనే కిడ్నాప్‌కి బీజం పడేలా చేసిందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి ఇంటర్నెట్ కాలింగ్‌పై మరింత పట్టు సాధించాడు.



మరోవైపు సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ క్రైమ్‌కి సంబంధించిన విషయాలను తెలుసుకున్నాడు. తన ఫేస్‌ బుక్‌లో దిశ కేసులో పోలీసుల కృషిని ప్రశంసిస్తూ.. గ్రేట్ పోలీస్ అంటూ కామెంట్ చేశాడు సాగర్‌. సెన్షేషనల్ క్రైమ్‌లకు సంబంధించిన అంశాలను సాగర్‌ నిశితంగా గమనించినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు దీక్షిత్‌కు సాగర్‌ స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ ఇచ్చాడా.. మత్తులో ఉండగానే చిన్నారిని చంపేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.



దీక్షిత్ కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు చేర్చారు పోలీసులు. నిందితుడు మంద సాగర్‌ ఏడాదికాలంగా డింగ్ టాక్ వాయిస్ అనే యాప్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అదే యాప్‌తో దీక్షిత్‌ పేరెంట్స్‌కి కాల్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశాడు సాగర్. మొబైల్‌ నెంబర్‌తో కాకుండా యాప్‌ కాల్ చేయడంతోనే నిందితుడు ఆలస్యంగా దొరికాడని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు.